Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాన్సెప్ట్ రియాల్టీ షోనే.. లక్ష్మీ టాక్ షో

Webdunia
ఈ రియాల్టీ షో ప్రస్తుతం ఉన్న అన్ని షోల మాదిరిగా కాదు. ఒక జీవితంలో ఎదురయ్యే అనుభవాలను పంచుకుంటూ, పాఠాలుగా మలుచుకుంటూ ఎదిగిన వైనాన్ని ఒక కాన్పెప్ట్ తీసుకుని రియాల్టీ షోగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఈ కార్యక్రమం నడుస్తోంది.

విలక్షణ నటుడు మోహన్‌బాబు కుమార్తె లక్ష్మీ మంచు ఈ కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. అసాధారణ మరియు ఆసక్తికర సెలెబ్రిటీ కాంబినేషన్‌ల సంపూర్ణ అనుభవాలను తెలిపే ఓ సాధారణ/అసాధారణ వేదికలా ఉండే ఈ షోను లక్ష్మీ టాక్ షోగా.. జీ తెలుగు టీవీలో ప్రతి శుక్రవారం 8.30 గంటలకు ప్రసారం చేస్తారు.

ఒకే రంగంలో ఉన్న ఇద్దరు లేదా ముగ్గురు సెలబ్రిటీల కాంబినేషన్‌‌ను ఈ సాధారణ వేదికపై ఆహ్వానించి.. విలువల్లో తేడాలు, అనుభవం, కెరీర్‌లో చేదు మరియు తీపి గురుతులు, నిజాలు, కారణాలు, జీవితంలో ఎదుర్కొన్న సంఘర్షణలు వంటివి చర్చిస్తారు.

అయితే ఈ షో.. సమస్యలు లేదా కొన్ని అంశాల పరిష్కారానికి మాత్రం కాదు. కానీ, ఇందులో పాల్గొన్న సెలబ్రిటీల ప్రతి స్వంత అభిప్రాయాన్ని గౌరవించడుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలోని అభిమాన ప్రముఖులు, స్టార్‌ల గురించి తెలిసిన, తెలియని మరిన్ని ఎన్నో వివరాలు ఈ వైవిధ్య కార్యక్రమంలో తెలుస్తాయి. వడపోసిన జీవితపు విలువలను తెలపడంలోను ఈ కార్యక్రమం కీలక పాత్ర వహిస్తుందని చెప్పొచ్చు.

సినిమా క్లైమాక్స్ చేరుకున్నప్పుడు ఉన్న ఉత్కంఠత.. సీరియల్ రక్తికట్టినపుడు వచ్చే ఉత్కంఠత.. మాదిరిగా.. ఈ కార్యక్రమం అద్యంతం ప్రేక్షకులను అహ్లాదపరుస్తుంది. కంటతడి పెట్టిస్తుంది. ఎందుకంటే.. తమ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, నిస్సహాయతలు, ఛేదించిన లక్ష్యాలు, అనుకోని లాభాలు, అద్భుతాలు, విఫలాలు కూడా సెలబ్రిటీలు యాంకర్ లక్ష్మీతో పంచుకుంటారు.

అందుకే.. ఈ కార్యక్రమం ఎనలేని పాప్యులారిటీని సంతరించుకుంది. అశేష అభిమానులను కూడగట్టుకుంది. మరింకేం.. మీరు చూడండి.. మీ అభిమాన తారల ఆసక్తికర విషయాలను తెలుసుకోండి.. మీ 'లక్ష్మీ టాక్ షో'లో.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని, శ్రీరెడ్డిలు పోయారు.. మా వారు తట్టుకుని నిలబడ్డారు.. నారా లోకేష్

చక్రం తిప్పిన పవర్ స్టార్.. ఆయన వల్లే గెలిచానన్న దేవేంద్ర బహిరంగ ప్రకటన (video)

జగన్‌ హయాంలో భూ ఆక్రమణలు.. వదిలిపెట్టేది లేదన్న పవన్ కల్యాణ్

30 నెలల్లో అమరావతిని పూర్తి చేస్తాం.. చంద్రబాబు ప్రకటన

మా 7 ఎకరాల పొలం, ఇల్లు ఫార్మాకి తీసుకుంటే మేం ఎక్కడ బతకాలి రేవంతన్న: లగచర్ల బాధితురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

Show comments