Webdunia - Bharat's app for daily news and videos

Install App

పది వసంతాలు పూర్తి చేసుకున్న జయ టీవీ

Webdunia
తమిళనాడు రాష్ట్రంలో అగ్రగామిగానున్న తమిళ టీవీ ఛానెల్ జయ టీవీ పది వసంతాలు పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరంలోకి అడుగు పెట్టింది.

జయ టీవీ పది సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరంలోకి అడుగు పెట్టిందని జయ టీవీ ప్రతినిధి చెన్నైలో విలేకరులకు తెలిపారు. తమ ప్రసారాలు తమిళనాడుతోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. తాము ప్రత్యేకమైన, నాణ్యమైన ప్రసారాలను అందిస్తున్నామని, ప్రజలకు ఉపయోగపడే ప్రసారాలను అందిస్తున్నామని ఆయన వెల్లడించారు.

తాము అందించే కార్యక్రమాలు ప్రజలకు, విద్యార్థులకు, గృహిణులకు, ఉద్యోగులకు తదితర వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. తాము ప్రసారం చేసే కార్యక్రమాల్లో భాగంగా అరుళ్ నేరమ్, తితిదేకు సంబంధించిన ప్రత్యేక ప్రసారాలు, బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసారాలు, కుష్బుచే నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం జాక్‌పాట్, విసువిన్ మక్కల్, ఆరంగమ్ తదితర కార్యక్రమాలు ప్రసారం చేసామని ఆయన వెల్లడించారు.

జయ నెట్‌వర్క్‌లోని రెండు ప్రత్యేక ఛానెల్స్ జయ ప్లస్, జయ మ్యాక్స్ ఛానెల్స్‌ను గడచిన దశాబ్దంలో ప్రారంభించామని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు వినూత్నమైన ప్రణాళికలను రూపొందించుకున్నామని ఆయన వెల్లడించారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments