న‌గ‌రిలో పొంగిన అభిమానం! ఎమ్మెల్యే రోజాకు రోజాల‌తో అభిషేకం!

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (20:35 IST)
నిన్న‌టి వ‌ర‌కు ఎమ్మెల్యే రోజాపై రాజ‌కీయ వ్య‌తిరేక‌త‌... నేడు ఉప్పొంగిన అభిమానం... రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్ప‌లేం అన‌డానికి ఇదో ఉదాహర‌ణ‌. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోని తీవ్ర అస‌మ్మ‌తిని ఎదుర్కొన్న రోజాకి ఇపుడు అదే న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు, ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఆమె మంత్రి అవుతుంద‌నే ఊహాగానాల‌తో ఆమెని రోజా పూల‌తో ముంచెత్తుతున్నారు.
 
నగరిలో ఎమ్మెల్యే ఆర్.కె. రోజా సోమవారం ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన్నారు. వడమాలపేట మండలం తట్నేరిలో ఆసియన్ అభివృద్ధి బ్యాంకు నిధులు 43 లక్షల రూపాయలతో నిర్మించిన పాదిరేడు- ఎల్.ఎం కండిగ వయా తట్నేరి నుంచి దళిత వాడ రోడ్డు ను ప్రారంభించారు.
 
అలాగే, వైఎస్సార్ జగనన్న కాలనీల గృహ నిర్మాణం కోసం నిరుపేదలైన లబ్దిదారులకు వైఎస్సార్ క్రాంతి పథం ద్వారా ఒకొక్కరికి 30 వేల రూపాయల వంతున ఎమ్మెల్యే రోజా పంపిణీ చేశారు. 
 
పాదిరేడు- ఎల్.ఎం కండిగ వయా తట్నేరి నుంచి తట్నేరి దళిత వాడ రోడ్డు నిర్మాణాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంకు ద్వారా చేయించినందుకు కృతజ్ఞతతో ఎమ్మెల్యే రోజాకు స్థానిక నాయ‌కులు, ప్ర‌జ‌లు పూలాభిషేకం చేసి ఘనంగా సత్కరించారు. రోజా నెత్తిన రోజా పూలు త‌ట్ట‌ల కొద్ది జ‌ల్లి... ఆమెను రోజా పూ రెమ్మ‌ల‌తో ముంచెత్తారు. నాయ‌కులు, ప్ర‌జ‌ల అభిమానానికి రోజా ఉబ్బి త‌బ్బిబ‌య్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతను నింపింది: రామ్ చరణ్

తెలుగు ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments