Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై వర్క్ ఫ్రమ్ హోం ... కార్మిక చట్టాన్ని సవరించే పనిలో... (video)

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (13:46 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ముఖ్యంగా, వైరస్ బారినపడకుండా ఉండేందుకు అనేక దేశాల్లో లాక్‌డౌన్ అమలవుతోంది. ఈ కారణంగా అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటు కల్పించాయి. ఇదే సౌకర్యాన్ని మున్ముందు కొనసాగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఈ వర్క్ ఫ్రం హోం విధానం కరోనా విపత్తు తొలగిపోయిన తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని ముందే గుర్తించిన కేంద్ర ప్రభుత్వం త్వరలోనే వర్క్ ఫ్రం హోంకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
 
ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో పనిచేసే ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణ కోసం మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉందని సమాచారం. ముఖ్యంగా ఉద్యోగుల పనిగంటలు, పని వాతావరణం, వేతనం మొదలైన వాటిపై కేంద్రం తన మార్గదర్శకాల్లో ప్రత్యేకంగా పేర్కొనే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
వర్క్ ఫ్రం హోంకు సంబంధించి ప్రస్తుత కార్మిక చట్టంలో ఎటువంటి మార్గదర్శకాలు లేవు. ఈ నేపథ్యంలో ప్రత్యేక మార్గదర్శకాలు అవసరమని ప్రభుత్వం భావిస్తున్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ మార్గదర్శకాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటును కల్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments