Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై భర్తలూ జాగ్రత్త.. అన్నం వండలేదా? గరిటెతో భర్తపై భార్య దాడి...

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (09:57 IST)
చెన్నైలో భర్తపై చేజేసుకున్న భార్య స్టోరీ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరుగుతుందంటే.. చెన్నై ఐనావరం ప్రాంతానికి చెందిన పొన్నువేల్ పురంలో తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు.. కార్తీక్ అనే వ్యక్తి. ఇతని భార్యపేరు ధనలక్ష్మి. ఈమె పిన్ని ఇల్లు పక్కనే వుండటంతో ధనలక్ష్మి ఆమె ఇంటికి అప్పుడప్పుడు వెళ్లడం పరిపాటి. దీంతో ఇంట్లో సమయానికి ధనలక్ష్మి వంట చేయకుండా గడిపింది. 
 
ఈ వ్యవహారంపై ధనలక్ష్మిని కార్తీక్ మందలించాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి పని ముగించుకుని ఆకలితో ఇంటికొచ్చిన కార్తీక్.. అన్నం వండలేదా..? అని భార్యను అడిగాడు. ఆకలితో వచ్చానని భోంచేద్దామనుకుంటే.. ఇంట్లో అన్నం కరువైందని వాగ్వివాదానికి దిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన ధనలక్ష్మి తన పిన్నిని ఇంటికి రప్పించి భర్తపై గరిటెతో దాడి చేసింది. 
 
ఈ దాడిలో కార్తీక్‌ తలకు గాయం తగిలింది. ప్రస్తుతం కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇకపోతే... ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నైలో భర్తలు జాగ్రత్త.. పెళ్లాన్ని అన్నం వండలేదా అని అడిగారంటే.. గరిటెతో దెబ్బలు తప్పవంటూ సెటైర్లు పేల్చుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments