తిమింగ‌లం లాలాజలం కూడా వ్యాపార‌మే, ఎన్ని కోట్లో!!

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (09:56 IST)
కాదేదీ దొంగ వ్యాపారానికి అన‌ర్హం అన్న‌ట్లు... కొంద‌రు పెద్ద దొంగ‌లు తిమింగ‌లం లాలాజ‌లాన్ని కూడా స్మ‌గ్లింగ్ చేస్తున్నారు. ఇదే కేసులో గుంటూరు జిల్లా నరసరావుపేట పోలీసులు 8 మందిని ప‌ట్టుకున్నారు. వారు నిషేధిత తిమింగలం అంబర్ గ్రీస్ (లాలాజలం) ని విక్ర‌యించే ముఠాగా పేర్కొన్నారు.

తిమింగ‌లం లాలాజ‌లాన్ని అంబ‌ర్ గ్రీస్ అంటార‌ట‌. దాన్ని కూడా ఆన్లైన్లో పెట్టి అమ్మేస్తున్నార‌ట ఈ ముఠా. ఇలా విక్రయించే ముఠాను పట్టుకున్న నరసరావుపేట పోలీసులు వారి నుంచి ఏడు కోట్ల  రూపాయల విలువ చేసే 8.25 కేజీల అంబర్ గ్రీస్ స్వాధీనం చేసుకున్నారు.

వీరిలో ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆరు బైకులు,ఎనిమిది సెల్ ఫోన్ లు సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పిల్లలను వదిలేశాడు.. ఆ పిల్లల తల్లిని అతని సోదరుడు వేధించాడు.. పవన్‌పై పూనమ్ ఫైర్

క్యాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ .. ఇండస్ట్రీ అద్దం లాంటిది

స్పిరిట్ చిత్రంలో ప్రభాస్‌తో మెగాస్టార్ చిరంజీవి నటిస్తారా?

అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చిన మెగాస్టార్

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి అదిరిపోద్ది సంక్రాంతి ఫుల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments