నీ భార్య కన్యేనా? అడిగిన పెద్దలు... పెళ్లి కుమారుడు ఏమన్నాడంటే?

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (10:22 IST)
పూణేకు చెందిన ఓ కాంగ్రెస్ కార్పొరేటర్ సునీల్ మాల్కే ఇంట్లో వర్జిన్ టెస్టు జరిగినట్లు గల వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. సునీల్ మాల్కే కుమారుడికి ఇటీవలే వివాహం అయ్యింది. పుణేలోని కంజర్‌భట్ కులానికి చెందిన సునీల్ మాల్కే కుమారుడి శోభనం రోజు తర్వాత కొందరు పెద్దలు కూర్చుని వివరాలు అడుగుతున్న వీడియో లీకైంది.
 
అతను పెళ్లి చేసుకున్న యువతి కన్యేనా? కాదా అని వారు అడుగుతున్న వీడియో అది. దానికి సమాధానంగా ఆ కొత్త పెళ్లికొడుకు సంతృప్తి చెందినట్టు మూడుసార్లు చెప్పాడు. ఆ తర్వాత పెళ్లి కూతురు, పెళ్లికొడుకు తరఫు వారు అక్కడ కూర్చున్న పెద్దలకు కొన్ని డబ్బులు ఇచ్చారు. అయితే దీన్ని కన్యత్వ పరీక్ష అనేందుకు వీల్లేదని అంటున్నారు సునీల్ మాల్కే. 
 
పెళ్లి చేసుకున్న తర్వాత హ్యాపీగా ఉన్నావా అని మామూలుగా అడగడమే కానీ, ఇలా కన్యత్వం టెస్ట్ కాదని చెప్పారు. గౌరవ ప్రదమైన తమ కుటుంబం మీద కొందరు రాళ్లు వేయడానికి ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని సునీల్ మాల్కే ఆరోపించారు.
 
కాగా మహారాష్ట్రలోని కంజర్‌భట్ కులంలో పెళ్లి కుమార్తెలకు ఇలాంటి కన్యత్వ పరీక్షలు మామూలే. సుమారు 450 సంవత్సరాలుగా ఈ సంప్రదాయం ఉంది. అయితే, గతంలో పెళ్లికుమార్తెను చాలా ఘోరంగా అవమానించేవారు. శోభనం రాత్రి తర్వాత రోజు పెళ్లికొడుకు.. రక్తంతో తడిసిన దుప్పటిని తీసుకెళ్లి పెద్దలకు చూపించాలి.
 
పెళ్లికూతురు కన్య అని అప్పుడు పెద్దలు నిర్ధారించే వారు. కొన్ని పోరాటాల తర్వాత ఈ సంస్కృతి మారింది. కానీ, పూర్తిగా సమసిపోలేదు. అప్పుడు బహిరంగంగా జరిగే ఈ సంప్రదాయం ప్రస్తుతం చాటుగా జరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోని వంద దేవుళ్లు చిత్రం నుంచి మెలోడీ గీతం విడుదల

Faria Abdullah: తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా గాయపడ సింహం నుంచి బ్రైడ్ సాంగ్

సై ఫై థ్రిల్లర్ మూవీ కిల్లర్ నుంచి డా. పూర్వజ్ ఫస్ట్ లుక్

ఏ మతాన్ని తక్కువ చూపించలేదు : టొవినో థామస్- కెరీర్ లో స్పెషల్ మూవీ: కయదు లోహర్

King 100: నాగార్జున, టబు కాంబినేషన్ లో కింగ్ 100 చిత్రం షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

ఎడిసన్ టౌన్‌షిప్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్: ప్రజా భద్రతపై అవగాహన సదస్సు

రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?

అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్-తమిళనాడు చాప్టర్ భాగస్వామ్యం

తర్వాతి కథనం