Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కర్‌లో చపాతీలను కుక్ చేసిన మహిళ.. వీడియో వైరల్

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (19:58 IST)
Chapathi
చపాతీలు ఎలా చేయాలో అందరికీ తెలిసిందే. అయితే ఓ మహిళ వైవిధ్యంగా చపాతీలు చేసింది. అందరిలా కాకుండా ప్రెజర్ కుక్కర్‌లో చపాతీలు తయారు చేసి ఆశ్చర్యపరిచింది. పెనం లేకున్నా చపాతీలను ఎలా సిద్ధం చేయవచ్చో చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఈ వైరల్ క్లిప్‌ను గమనిస్తే.. ఆ మహిళ తన వంట గదిలో స్టవ్ వెలిగించి దానిపై ఖాళీ ప్రెజర్ కుక్కర్ పెట్టింది. వేడి అయ్యే వరకు వేచి ఉంచి, అనంతరం రుద్దిన మూడు చపాతీలను కుక్కర్లో వేసి మూత పెట్టింది. హై ఫ్లేమ్‌లో వాటిని ఉడికించింది. ఆ తరువాత రోలింగ్ పిన్ సహాయంతో మూడు చపాతీలు ఒకదాని తర్వాత మరోకటి తీయడంతో వీడియో ముగుస్తుంది.
 
ప్రెజర్ కుక్కర్ లిడ్‌తో పాటు వెయిటింగ్ వాల్వ్, గాస్కెట్ సీలింగ్ రింగును కూడా ఆమె ఉంచింది. అంతేకాకుండా మూతను గట్టిగా మూసివేసి మూడు నిమిషాల పాటు వేచి ఉండాలని వీడియోలో సూచించింది. 
 
కొంత సమయం తర్వాత ప్రెజర్ కుక్క మూత తెరిచి స్క్రిమ్మర్ సహాయంతో చపాతీలను ఒకదాని తర్వాత మరోకటి బయటకు తీసి ప్లేటులో ఉంచింది. చపాతీలను ఈ రకంగా కూడా వండుకోవచ్చని ఆమె తెలియజేసింది. 
 
వీడియోను గమనిస్తే.. పెనంపై వండిన చపాతీలకు, కుక్కర్లో వండిన వాటికి ఏ మాత్రం తేడా లేనట్లు కనిపిస్తుంది. ఈ వీడియో బ్యాచిలర్లకు బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ వంట వీడియో సామాజిక మాధ్యమాల్లో చాలా మందికి విపరీతంగా నచ్చింది. సోషల్ మీడియాలో నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments