Bullet Bandi: ఒక్క డ్యాన్స్‌తో ఓవర్ నైట్ సెలబ్రిటీ, ఎవరు..?

Webdunia
ఆదివారం, 22 ఆగస్టు 2021 (00:01 IST)
ఒకే ఒక్క పాట ఆమెను సెలబ్రిటీని చేసేసింది. అసలు ఆమె వేసిన డ్యాన్స్ అందరినీ బాగా ఆకట్టుకుంది. పెళ్ళి కొడుకు ఉండగానే అతని ముందుగానే ఇష్టమొచ్చినట్లు డ్యాన్స్ వేస్తూ అందరినీ ఆకట్టుకుంది. మొదట్లో పెళ్ళి కొడుకు కాసేపు డ్యాన్స్ వేశాడు కానీ ఆ తరువాత ఎక్కువసేపు డ్యాన్స్ వేయలేకపోయాడు. ఆ యువతి ఎవరన్నది ఇప్పుడు అందరిలోను ఆసక్తికరంగా మారింది.
 
ఆమె పేరు సాయిశ్రియ. మంచిర్యాలకు చెందిన యువతి. అటవీశాఖ ఉద్యోగి ఎఫ్ఎస్ ఓ రాము, సురేఖ దంపతుల పెద్ద కుమార్తె. రామక్రిష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో ఈనెల 14వ తేదీన వివాహం జరిగింది. అయితే ఈ వివాహం జరిగిన తరువాత ఇంటికి వచ్చినప్పుడు భార్యాభర్తలిద్దరూ డ్యాన్స్ వేశారు. 
 
సాయిశ్రియ మాత్రం ఎంతో అద్భుతంగా డ్యాన్స్ వేసింది. ఆ వీడియో కాస్త బాగా వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అసలు ఆ యువతి అన్న విషయాన్ని అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సాధారణ యువతి ఆ స్థాయిలో డ్యాన్స్ వేయడంతో అందరూ మెచ్చుకుంటున్నారు. ఆ డ్యాన్స్‌తో బుల్లెట్ బండికి పాటకు మంచి పేరే వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రిష కృష్ణన్‌ బ్యూటీ సీక్రెట్ అదే.. చీరలంటే ఆమెకు చాలా ఇష్టం

ఐక్య నా బిడ్డ లాంటిది, మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది: మనోజ్ మంచు

Yash: టాక్సిస్ సెట్ నుండి రాయ గా యష్ లుక్

నారా లోకేష్‌కు ఎక్కువ మంది పిల్లలు వుండాలని భావిద్దాం, బావ ఫోటో పెట్టావు: పూనమ్ కౌర్ ట్వీట్

Yash: టాక్సిక్ సెట్ నుండి రాయా గా అద్భుతమైన స్టిల్‌ తో యష్

తర్వాతి కథనం
Show comments