తెలంగాణ ఇస్తున్నట్టు సోనియా చెప్పాకే.. కేసీఆర్ నన్ను తరిమేశారు : విజయశాంతి

తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నామని 2013 జూలైలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన రాత్రే తనను టీఆర్‌ఎస్‌ నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ సస్పెండ్‌ చేశారని సినీ నటి, కాంగ్రెస్ మహిళా నేత విజయశాం

Webdunia
ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (11:26 IST)
తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నామని 2013 జూలైలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన రాత్రే తనను టీఆర్‌ఎస్‌ నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ సస్పెండ్‌ చేశారని సినీ నటి, కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి ఆరోపించారు. అప్పట్లో తనను సస్పెండ్ చేయడానికి కారణం ఏంటన్న విషయాన్ని చెప్పలేదన్న ఆమె, 2014లో ప్రత్యేక రాష్ట్ర బిల్లు పాసైన తర్వాతే తాను కాంగ్రెస్‌లో చేరానని గుర్తు చేశారు.
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండిపోయిన నటి విజయశాంతి, తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలు స్వీకరించి, స్టార్ క్యాంపెయినర్‌గా రంగంలోకి దిగారు. ప్రస్తుతం తాజా రాజకీయ పరిణామాలపై ఆమె స్పందిస్తూ, ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నామని విజయం సాధిస్తామన్నారు. 
 
తనను స్టార్‌ క్యాంపెయినర్‌గా నియమించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి కృతజ్ఞతలు చెప్పారు. యుద్ధం అంటే శత్రువులపై యుద్ధమని, తమ శత్రువులను ఓడించి ప్రజలకు మేలు చేస్తామన్నారు. కాలంతో పాటు మనుషులు కూడా మారుతున్నారన్నారు. ప్రజలకు మేలు జరగాలనేదే తమ ప్రయత్నమన్నారు. దేవుడు ఇచ్చిన చెల్లెలు అని గతంలో తనను కేసీఆర్‌ అన్నారని, తాను మాత్రం కేసీఆర్‌ను దేవుడు ఇచ్చిన అన్న అని ఎక్కడా చెప్పలేదని విజయశాంతి వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments