ఆ వ్యక్తి కడుపులో 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్‌బ్రష్‌లు, రెండు పెన్నులు.. ఎలా వెళ్లాలి?

సెల్వి
శుక్రవారం, 26 సెప్టెంబరు 2025 (15:05 IST)
spoons, brush, pen
ఒక వ్యక్తి కడుపులో స్టేషనరీ షాపునే పెట్టుకున్నాడు. ఒక వ్యక్తి కడుపులో ఏకంగా 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్‌బ్రష్‌లు, రెండు పెన్నులు వుండటం గమనించిన వైద్యులు షాకయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 
 
వివరాల్లోకి వెళితే.. హాపుర్‌కు చెందిన 35 ఏళ్ల సచిన్‌ను అతని కుటుంబ సభ్యులు ఘజియాబాద్‌లోని ఒక డీ-అడిక్షన్ సెంటర్‌లో చేర్పించారు. అయితే, తనను అక్కడ వదిలి వెళ్లడం, సెంటర్‌లో సరైన ఆహారం పెట్టకపోవడంతో సచిన్ తీవ్రమైన కోపానికి గురయ్యాడు. 
 
ఆకలికి సరిగ్గా అన్నం పెట్టకపోవడంతో వంటగదిలోని స్టీల్ స్పూన్లను దొంగిలించి, బాత్రూమ్‌లోకి తీసుకెళ్లేవాడు. వాటిని ముక్కలుగా విరిచి, నోట్లో పెట్టుకుని నీళ్ల సహాయంతో గొంతులోకి తోసేసుకునేవాడు. ఇలా స్పూన్లతో పాటు టూత్‌బ్రష్‌లు, పెన్నులను కూడా మింగడం ప్రారంభించాడు. 
 
కొన్ని రోజుల తర్వాత తీవ్రమైన కడుపునొప్పి రావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. ఎక్స్-రే, సీటీ స్కాన్ తీసిన వైద్యులు, అతని కడుపులో పేరుకుపోయిన వస్తువులను చూసి షాక్‌కు గురయ్యారు. 
 
ఆపై శస్త్ర చికిత్స చేసి వాటిని బయటికి తీశారు. సచిన్ మానసిక స్థితి సరిగ్గా లేదని.. అందుకే ఇలాంటి పనులు చేశాడని.. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా వుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments