Webdunia - Bharat's app for daily news and videos

Install App

మల్లె, లిల్లీ, గులాబీ పూలతో ఫేస్ మాస్క్‌లు.. వధూవరులు ఫిదా

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (12:55 IST)
flower
కరోనా కాలంలో ఎన్నో వ్యాపారాలు నష్టపోయాయి. బిజినెస్ లేకపోవడంతో వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారు. కానీ కొంతమంది స్మార్ట్‌గా ఆలోచిస్తూ.. వ్యాపారాన్ని లాభాల బాటలోకి తెచ్చుకుంటున్నారు. కరోనా కారణంగా.. మాస్క్, శానిటైజర్స్, ఫేస్ మాస్క్‌లకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. పెళ్లిళ్లు కొన్ని నియమనిబంధనల మధ్య జరుపుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎంతో సంతోషంగా గడుపుకోవాలని అనుకున్న వధూవరులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు.
 
పెళ్లి పీటల మధ్య ముసిముసి నవ్వులతో మెరిసిపోవాల్సిన వధూవరులకు మాస్క్ కంపల్సరీ. తమిళనాడు రాష్ట్రంలోని మదురై స్వామికన్నిగైకి చెందిన పూల వ్యాపారి మోహన్…చాలా స్మార్ట్ గా ఆలోచించాడు. చక్కటి మాస్క్ లను రూపొందించాడు. రకరకాల పూలతో చక్కటి నైపుణ్యంతో సరికొత్త మాస్క్ లను తయారు చేశాడు. వధూవరుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ మాస్క్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. 
 
మూడు పొరల ముసుగులో మల్లె, లిల్లీ, గులాబీ పూలతో ఫేస్ మాస్క్‌లు తయారు చేశారు. కరోనాపై అవగాహన కల్పించేలా వధూవరులకు పూలతో మాస్క్ తయారు చేశానని అంటున్నారు మోహన్. ఫ్లవర్ మాస్క్ లకు ఆర్డర్స్ వస్తున్నట్లు, పూల మాస్క్ ధరించిన వధూవరులు చూడటానికి అందంగా ఉంటుందని వెల్లడిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments