Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్ టాక్ యాప్ మళ్లీ వచ్చేసింది బాబోయ్..!

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (11:51 IST)
ఇప్పటి కాలంలో రోజుకు తింటున్నారో లేదా కానీ, మొబైల్ ఫోన్స్ మాత్రం ఎక్కువగా వాడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే టిక్ టాక్ యాప్. ఈ యాప్‌ను కొన్నిరోజుల పాటు నిషేధించారు. టిక్ టాక్ యాప్ నిషేధంతో చాలామంది తీవ్రమైన అసహానం చెందారు. మేమంతా టిక్ టాక్‌తో తమాషా వీడియోలు చేసుకుని కాలక్షేపం చేస్తుంటామనీ.. అలాంటి యాప్ పైన నిషేధం ఏంటని విమర్శించారు. 
 
దాని వలన కానీ, మరి దేనివలనో కానీ టిక్ టాక్ యాప్ పైన వున్న నిషేధాన్ని ఎత్తివేశారు. దీనితో మళ్లీ నెటిజన్లు వీడియోలు చేసి షేర్ చేసుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా.. నిషేధం విధించిన చైనా యాప్ టిక్ టాక్‌ను అనుమతిస్తున్నట్టు మద్రాసు హైకోర్టు స్పష్టం చేసినప్పటికీ తమకు ఈ యాప్ ఇప్పటికి గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ల‌లో యూజర్లకు అందుబాటులో లేదు. 
 
దీనిపై హైకోర్టు నుండి తమకు మార్గదర్శకాలు వచ్చిన తర్వాతనే తాము ఆయా సంస్థలతో అధికారికంగా మాట్లాడుతామని సమాచార, సాంకేతిక, మంత్రిత్వ శాఖలోని ప్రతినిధులు మీడియాకు తెలియజేశారు. ఈ యాప్‌పైతాము విధించిన నిషేధం కొనసాగుతుందని మద్రాసు హైకోర్టు ఇటీవల మరోసారి స్పష్టం చేసిన నేపథ్యంలో ఏప్రిల్ 3న కేంద్ర ఐటీ శాఖ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లలో యాప్‌లు లభ్యం కాకుండా చేయాలని సూచించిన విషయం తెలిసిందే.
 
స్మార్ట్‌ఫోన్‌లలో ప్రత్యేక ఫీచర్లతో యూజర్లు ఈ యాప్ ద్వారా వీడియోలను తీసుకునే వారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. అయితే, వీడియో యాప్‌ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని అభ్యంతరాలు వచ్చాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments