సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గం కర్సిగుత్తిలో గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభోత్సవానికి వెళ్లే సందర్భంగా తెలంగాణ- కర్నాటక రాష్ట్రాల సరిహద్దు జిల్లా బీదర్ లోని ఓ గ్రామం వద్ద ఆగి గ్రామస్థులతో ముచ్చటించారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు.
తాగు, సాగు నీరు, విద్యుత్, రైతులకు అందుతున్న సాయంపై గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు మీదుగా వెళుతుండగా కనిపించిన గ్రామస్థులతో సంభాషణ.
మంత్రి- అమ్మా బాగున్నారా... ఎలా ఉన్నారు. మీది ఏ గ్రామం.
మహిళలు- మాది కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా జాంబిగ గ్రామంలోని గామ తండా వాసులం.
మంత్రి- మీకు పెన్షన్స్ ఇస్తోందా మీ ప్రభుత్వం, ఎంత ఇస్తున్నారు.
మహిళలు- మా ప్రభుత్వం ఐదువందల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు.
మంత్రి- తెలంగాణ రాష్ట్రంలోని మీ పక్కనే ఉన్న నారాయణఖేడ్‌లో పెన్షన్ ఎంత ఇస్తున్నారో తెలుసా.
మహిళలు- మా వాళ్లు అక్కడ ఉన్నారు సార్. రెండు వేల రూపాయలు ఇస్తున్నారు.
మంత్రి- విద్యుత్ ఎంతసేపు ఇస్తున్నారు.
రైతు- ఐదు గంటలు కూడా కరెంటు రావడంలేదు ప్రతీ పది నిముషాలకు ఒక సారి కరెంట్ వస్తూ పోతూ ఉంటుంది. నా ఐదేకరాల పంటకు నీరు పారాలంటే పది రోజులు పడుతుంది సార్.
మంత్రి- పక్కనే నారాయణ ఖేడ్‌లో కరెంటు ఎలా ఉంది.
గ్రామస్థులు- సార్ పక్కనే తెలంగాణ గ్రామాలు మాకు కనిపిస్తనే ఉంటుంది. 24 గంటలు కరెంట్ వస్తోంది. మేం చూస్తూనే ఉన్నాం. మా బాధలు తెలుసుకునే వారే లేరు.
మంత్రి- అమ్మా ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ సందర్భంగా ప్రభుత్వ సాయం ఏమైనా అందుతుందా.