ట్రెండింగ్‌లో ఫాదర్స్ డే ఫోటో.. కుమార్తెకు సెల్యూట్ చేసిన తండ్రి

సెల్వి
శుక్రవారం, 21 జూన్ 2024 (18:16 IST)
Fathers Day
ఫాదర్స్ డే సందర్భంగా తెలంగాణ అధికారి ఐఏఎస్ కుమార్తెకు సెల్యూట్‌తో శుభాకాంక్షలు తెలిపిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తెలంగాణ పోలీస్ అధికారి ఎన్ వెంకటేశ్వర్లు తన కుమార్తెకు సెల్యూట్ చేస్తూ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇద్దరూ చిరునవ్వులతో పలకరించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 
వివరాల్లోకి వెళితే.. శిక్షణ కార్యక్రమంలో భాగంగా అకాడమీకి వచ్చిన ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి అయిన ఆయన కుమార్తె ఎన్ ఉమా హారతికి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ అకాడమీ (టీఎస్ పీఏ) డిప్యూటీ డైరెక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు.
 
వెంకటేశ్వర్లు తన కుమార్తెకు సెల్యూట్‌తో పాటు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ఆపై తండ్రీకూతుళ్లు తమ తోటి అధికారులతో కలిసి శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు.. ఫాదర్స్ డే ముగిసి వారం రోజులైనా నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments