Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ - జనసేనలు కలిసి పోటీ చేయొచ్చు : టీజీ వెంకటేష్

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (16:24 IST)
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన పార్టీలు మళ్లీ కలిసి పోటీ చేయొచ్చంటూ టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం సమాజ్‌వాదీ - బహుజన్ సమాజ్‌వాదీ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయని అందువల్ల ఏపీలో కూడా టీడీపీ - జనసేనలు కలిసి పోటీ చేయడంలో తప్పులేదన్నారు. 
 
పైగా, ఈ రెండు పార్టీల మధ్య రాష్ట్ర స్థాయిలో ఎలాంటి వైరం లేదన్నారు. కానీ, రాష్ట్రానికి జరిగిన అన్యాయం విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నిలదీసే విషయంలోనే టీడీపీ - జనసేనల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయని చెప్పారు. 
 
ఇకపోతే, కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ కేటాయింపులో ఎలాంటి గందరగోళం లేదనీ, కానీ ఎస్వీ మోహన్ రెడ్డి మాత్రం ఈ టిక్కెట్‌ను తనకే కేటాయిస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ కారణంగానే కొంత గందరగోళం నెలకొందన్నారు. వాస్తవానికి సర్వే ఫలితాల మేరకు ఈ సీటును పార్టీ అధినేత కేటాయిస్తారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments