ఏబీవీపి వాళ్లే దాడి చేశారు.. జెఎన్‌యు ఘటనపై నటి తాప్సి ఆరోపణ

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (11:52 IST)
ఆదివారం నాడు జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ప్రాంగణంలో కొందరు దుండగులు ముసుగులు ధరించి వర్సిటీలోని వసతి గృహాల్లోకి చొచ్చుకెళ్లి కర్రలు, రాడ్లు, రాళ్లతో విద్యార్థులపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో విద్యార్థులతోపాటు వర్సిటీ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్‌ ఆయిశీ ఘోష్‌ తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ ఘటన సమయంలో విద్యార్థులు ఎంత వారించినా దుండగులు వారి మాటలను పట్టించుకోలేదు. కర్రలతో కొడుతూ, అక్కడి ఫర్నీచర్ ఇతర సామగ్రిని ధ్వంసం చేస్తూ వీరంగం సృష్టించారు. ఈ దాడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 
 
మరోవైపు నటి తాప్సి స్పందిస్తూ... ఏబీవీపీ సభ్యులే విద్యార్థులపై దాడి చేశారంటూ ఆరోపణలు గుప్పించారు. పిల్లల భవిష్యత్‌కు మంచి బాటలు పడాల్సిన చోట ఇలాంటి దారుణాలు జరగడం శోచనీయమనీ, బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను హీరోయిన్‌ స్వరా భాస్కర్‌, షబానా అజ్మీ కూడా ఖండించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments