Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ లేని ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం : సుందర్ పిచాయ్

Webdunia
బుధవారం, 15 జులై 2020 (20:47 IST)
భారతదేశంలో స్మార్ట్ ఫోన్ లేని ప్రతి ఇంటింటిక ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో రిలయన్స్ జియో ఫ్లాట్‌ఫామ్స్‌లో భాగస్వాములు కావడం గొప్పగా ఉందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. 
 
రిలయన్స్ జియో ప్లాట్ ఫామ్‌లో గూగుల్ సంస్థ రూ. 33,737 కోట్ల పెట్లుబడులు పెట్టనుందని ముఖేశ్ అంబానీ ప్రకటించారు. ఈ పెట్టుబడితో గూగుల్ దాదాపు 7.7 శాతం వాటాను సొంతం చేసుకోనుందని చెప్పారు. అంటే రిలయన్స్ జియోతో గూగుల్ వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటుందని తెలిపారు. 
 
ఈ అంశంపై సుందర్ పిచాయ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలన్నారు. గూగుల్ ఫర్ ఇండియా డిజిటలైషన్ ఫండ్‌లో తొలి విడతగా రిలయన్స్ లో 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్టు చెప్పారు. 
 
ఇది తమకు చాలా గర్వంగా ఉందని చెప్పారు. స్మార్ట్ ఫోన్ లేని లక్షలాది మందికి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో భాగస్వాములం కావడం గొప్పగా ఉందని అన్నారు. 
 
అంతకుముందు బుధవారం ముంబైలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 40వ వార్షిక సర్వసభ్య సమావేశాలు ఆ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ, జియో 4జీ స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు నిబద్దతను కలిగి ఉంది. 
 
ఈరోజు వరకు 10 కోట్ల జియోఫోన్లను విక్రయించాం. గూగుల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా అందుబాటు ధరల్లో ఎంట్రీ లెవల్‌ 4జీ, 5జీ ఫోన్లను తయారీ చేయగలమని నమ్ముతున్నాం అని ముఖేశ్ అంబానీ తెలిపారు. 
 
ఇప్పటికీ 35కోట్ల మంది 2జీ స్మార్ట్‌ఫోన్లను వినియోగిస్తారని, వారి దృష్టిలో ఉంచుకొని చౌకధరల్లో స్మార్ట్‌ఫోన్‌ తయారీకి సిద్ధమైనట్లు ఆయన తెలిపారు. జియో, గూగుల్‌ సంయుక్త భాగస్వామ్యంలో తయారీ అయ్యే 4జీ, 5జీ ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్‌.... ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, ప్లే స్టోర్‌ను ఆప్టిమైజ్‌ చేసుకోనే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విద్యార్థుల సమక్షంలో త్రిబాణధారి బార్భరిక్ మూవీ నుంచి పాట విడుదల

Sidhu : జాక్ చిత్రంలో బూతు డైలాగ్ లుంటాయ్ : సిద్ధు జొన్నలగడ్డ

మినిమం ఓపెనింగ్‌ను రాబట్టుకోలేకపోతున్న టాలీవుడ్ హీరోలు!!

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments