Webdunia - Bharat's app for daily news and videos

Install App

లీటరు తేలు విషం ధర ఎంతో తెలుసా?

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2023 (11:56 IST)
Scorpion
సాధారణంగా తేలు పేరు చెప్పినా.. దాన్ని చూసినా భయపడిపోతాం. అలాంటి తేలు విషానికి మార్కెట్‌లో భలే డిమాండ్ వుంది. లీటర్ విషం ఏకంగా రూ.82 కోట్ల మేరకు ధర పలుకుతుంది. అందుకే కొందరు తేళ్ల ఫారాలను నిర్వహిస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేల కొద్దీ తేళ్లు ఒకే చోట లుకలుకలాడుతూ తిరుగుతుండటం చూడలేక పలువురు భయపడిపోతున్నారు. 
 
తేలు విషాన్ని అనేక సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగిస్తున్నారు. అలాగే, ఇతర ఔషధల తయారీలో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. కొన్ని ఆసియా దేశాల్లో సంప్రదాయ వైద్య విధానాల్లో తేలు విషానికి అమిత ప్రాధాన్యత ఉంది. దీంతో అనేక ప్రాంతాల్లో తేళ్ల ఫారాలు వెలిశాయి. కేన్సర్ మందలు తయారీలోనూ తేలు విషం వాడుతున్నారు. ఈ విషాన్ని నిల్వ చేసేందుకు ప్రత్యేక పద్దతులను కూడా అవలంభిస్తున్నారు. 
 
సాధారణంగా ఒక్కో తేలు నుంచి రోజుకు 2 మిల్లీలీటర్ల విషాన్ని సేకరిస్తుంటారు. తేలు కొండెను ట్విజర్స్‌తో పిండి విషాన్ని వెలికి తీస్తారు. ఈ ప్రక్రియలో తేలుకు ఎలాంటి హాని జరగదు. నెట్టింట్లో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న ఈవీడియోను మీరు కూడా చూడండి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments