Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్ పైన హింసను వెంటనే ఆపేయండి: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి ప్రధాని మోదీ విజ్ఞప్తి

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (11:42 IST)
ఉక్రెయిన్‌ పైన రష్యా దాడితో ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. తాము ఒంటరిగా మిగిలిపోయామని ఉక్రెయిన్ దేశస్థులు కుమిలిపోతున్నారు. మరోవైపు ఉక్రెయిన్ పైన రష్యా దాడిని అమెరికా, యూరోపియన్ నాయకులు ఖండించారు. కానీ అంతకుమించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు.

 
ఈ నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి ఫోన్ చేసారు. ఉక్రెయిన్ పైన దాడిని తక్షణమే నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. రష్యా చర్యను ఖండించాలని భారత్‌పై ఒత్తిడి చేస్తున్న పాశ్చాత్య కూటమికి ప్రధాని రష్యా అధ్యక్షుడితో మాట్లాడటంతో అంతా ఇటువైపే చూస్తున్నారు. ఉక్రెయిన్ సైతం ప్రధాని మోదీ వైపు ఆశగా చూస్తోంది.

 
ఇంకోవైపు రష్యన్ సైనిక బలగాలు ప్రేరేపించని, అన్యాయమైన దాడిని ఉక్రెయిన్ దేశం పైన దిగాయని అమెరికా అధ్యక్షుడు అన్నారు. బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ... పుతిన్ చేతులు ఉక్రెయిన్ రక్తంతో తడిసిపోయాయని అన్నారు.

 
రష్యా, నాటో దేశాల మధ్య తలెత్తిన విభేదాలు చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించబడతాయని ప్రధానమంత్రి మోదీ విశ్వాసం వ్యక్తం చేసారు. ఉక్రెయిన్ పైన హింసను తక్షణమే నిలిపివేయాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. దౌత్యపరమైన చర్చలు, సంభాషణలకు అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ దేశాలన్నీ సంఘటితంగా ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments