Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనుమంతుడి జన్మస్థలంపై సరికొత్త వివాదం!

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (15:52 IST)
హనుమంతుడి జన్మస్థలంపై సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. హనుమంతుడు జన్మించింది కిష్కిండ, అంజనాద్రినేకాకుండా మహారాష్ట్రలోని అంజనేరి కూడా కాదని వాదిస్తున్నారు. తాజాగా ప్రముఖ న్యాయవాది, బీజేపీ నేత కుమారుడైన శ్రీనివాస్ ఖలాప్ సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు. హనుమంతుడు గోవాలో జన్మించారని వాదిస్తున్నారు. 
 
శ్రీమండలాచార్య మహత్ పీఠాదిపతి స్వామి అనికేత్ శాస్త్రి దేశ్‌పాండే మహారాజ్ ఆధ్వర్యంలో మే 31వ తేదీన నాసిక్‌లో ధర్మ సంసద్ ఏర్పాటు చేశారు. వాల్మీకి రామయాణాన్ని చేతబట్టిన ధర్మ సంసద్‌కు చేరుకున్న మహంత్ గోవింద్ దాస్ స్వామి హనుమంతుడి జన్మస్థలంపై తన వాదనను బలంగా వినిపించారు. దీనిపై ప్రతివాదులు ఆయనపై ఆగ్రహించారు. ఈ కారణంగా హనుమంతుడి జన్మస్థలంపై వివాదం చెలరేగింది. 
 
ఈ నేపథ్యంలో గోవా మాజీ మంత్రి రమాకాంత్ ఖలాప్ కుమారుడై శ్రీనివాస్ ఖలాప్ గోవాలోని అంజేదేవి ద్విపమే ఆంజనేయ స్వామి జన్మస్థలమని, వాల్మీకి రామాయణం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుందని శ్రీనివాస్ ఖలాప్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం మీడియాకు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments