ఛాయ్ వాలా పదాన్ని తొలగించను.. ఎవరి మాట వినలేదు..

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (13:14 IST)
అర్షద్ ఖాన్ గుర్తున్నాడా? పాకిస్థాన్‌లో దాదాపు నాలుగేళ్ల క్రితం జియా అనే ఫోటోగ్రాఫర్ తీసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో క్రేజీగా వైరల్ కావడంతో అర్షద్ ఖాన్ ఏకంగా మోడల్‌గా మారిపోయాడు. చాయ్‌వాలా ఆఫ్‌ పాకిస్తాన్‌‌‌గా విపరీతమైన పాపులారిటీతో పాటు డబ్బు సంపాదించాడు. ఇప్పుడు సొంతంగా ఇస్లామాబాద్‌లో ఓ అధునాతన కేఫ్‌ను ప్రారంభించాడు. ఓ చిన్న దుకాణంలో టీ అమ్ముకునే అర్షద్‌ నాలుగేళ్లలోపే తిరిగేసరికి ఓ భారీ కేఫ్‌కు యజమానిగా మారిపోయాడు. 
 
''కేఫ్‌ చాయ్‌వాలా రూఫ్ టాప్‌" పేరుతో ప్రారంభించిన ఈ కేఫ్‌ గురించి అర్షద్‌ ఖాన్‌ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. 'కేఫ్‌ పేరులోని చాయ్‌వాలా అనే పదాన్ని తొలగిస్తే మేలని చాలా మంది సలహాలిచ్చారు. కానీ తాను ఎవరి మాట వినలేదని తెలిపాడు. ఆ చాయ్‌వాలా అనే పదమే తనకు ఇంతటి గుర్తింపును తీసుకొచ్చిందని అర్షద్‌ చెప్పాడు. 
 
కేఫ్‌ పేరు మోడల్‌గా వున్నా లోపల ఇంటీరియర్స్‌ను మాత్రం సంప్రదాయం ఉట్టిపడేలా తీర్చిదిద్దామని తెలిపాడు. వివిధ వెరైటీల కాఫీ, టీలతోపాటు 20 రకాల డిషెస్‌ తమ హోటల్‌లో లభిస్తాయన్నాడు. కేఫ్‌ను ప్రారంభించినప్పటి నుంచి అర్షద్‌ఖాన్‌ను నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments