Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో భానుడి ప్రచండ నిప్పులు : రాజస్థాన్‌లో 'చుర్'మంటున్న ఎండలు (video)

Webdunia
బుధవారం, 27 మే 2020 (11:07 IST)
దేశంలోని పలు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నారు. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాలతో పాటు.. తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో  సూర్యతాపం తీవ్రస్థాయిలో వుంది. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉక్కపోతను భరించలేక వృద్ధులు, చిన్నారులు ప్రాణాలు విడుస్తున్నారు. 
 
గత 24 గంటల్లో భానుడు ప్రచండ నిప్పులు కురిపించినట్టు వెదర్ మానిటరింగ్ వెబ్‌సైట్ ఎల్ డొరాడో తెలింది. గత 24 గంటల్లో ప్రపంచంలోనే అత్యధికంగా వేడిమి నమోదైన ప్రాంతాల్లో 10 ప్రాంతాలు ఒక్క భారత్‌లోనే ఉన్నట్టు ఎల్ డొరాడో తెలిపింది. 
 
ఈ వెబ్ సైట్ వెల్లడించిన వివరాల మేరకు రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చురులో మంగళవారం నాడు 50 సెల్సియస్ డిగ్రీల వేడిమి నమోదైంది. థార్ ఎడారికి ముఖద్వారంగా చెప్పుకునే చురు ప్రాంతంలో ప్రతి యేడాది ఇదే పరిస్థితి ఉంటుంది. 
 
ఇకపోతే, మంగళవారం ప్రపంచంలోనే హాటెస్ట్ ప్లేస్‌గా అభివర్ణించే పాకిస్థాన్‌లోని జకోబాబాద్‌లో నమోదైన వేడిమికి సమానంగా చురులో ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. చురుతో పాటు రాజస్థాన్‌లోని బికనీర్, గంగా నగర్, పిలని పట్టణాల్లోనూ, ఉత్తర ప్రదేశ్‌లోని బందా, హిస్సార్, మహారాష్ట్ర, హర్యానాలోనూ గరిష్ట వేడిమి నమోదైనట్టు పేర్కొంది. 
 
న్యూఢిల్లీలో 47.6 డిగ్రీలు, బికనీర్ లో 47.4, గంగానగర్ లో 47, ఝాన్సీలో 47, పిలనిలో 46.9, నాగపూర్ లో 46.8, అకోలాలో 46.5 సెల్సియస్ డిగ్రీల వేడిమి నమోదైందని అధికారులు వెల్లడించారు. 2016, మే 19న 50.2 డిగ్రీలుగా నమోదైన చురు ఉష్ణోగ్రత, తిరిగి అదే స్థాయికి చేరడం ఇదే తొలిసారని స్థానిక వాతావరణ అధికారులు వెల్లడించారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments