దీప కాంతులతో వెలిగిన భారతావని... కరోనా వెళ్లిపో అంటూ దీప ప్రజ్వలన

Webdunia
ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (21:46 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడి పిలుపు మేరకు కరోనా చీకట్లను తరిమికొట్టాలన్న ప్రగాఢ సంకల్పంతో దేశ ప్రజలంతా దీప ప్రజ్వలన చేశారు. కరోనా వైరస్‌పై దేశం జరుపుతున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ ఆదివారం రాత్రి సరిగ్గా 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు ప్రజంలతా దీపాలు వెలిగించారు. తమ ఇంట్లోని విద్యుత్‌ దీపాలను 9 నిమిషాల పాటు ఆపి.. 9 నిమిషాల పాటు కొవ్వొత్తులు లేదా ప్రమిదలు వెలిగించారు. ఇళ్ల ముంగిట, బాల్కనీల్లో దీపాలు వెలిగించి తమ సంఘీభావం ప్రకటించారు. 
 
ఢిల్లీలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం తెలిపారు. ప్రజలు కూడా జ్యోతులు వెలిగించి ఐక్యత చాటుకున్నారు. గో కరోనా అంటూ నానాదాలు చేశారు. 
 
ఈ కార్యక్రమంతో దీప కాంతులతో భారతావని వెలిగిపోయింది. నగరాలు, పట్టణాలే కాకుండా గ్రామాల్లో సైతం మోడి పిలుపుకు విశేష స్పందన వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజలు తమ నివాసాల్లో లైట్లు ఆర్పి దీపాలు, కొవ్వొత్తులతో కరోనా మహమ్మారిపై పోరాట స్ఫూర్తిని చాటారు.
 
కాగా, కాంతి జ‌గ‌తికి క్రాంతి, శాంతి ప్ర‌సాదిస్తుందని భావిస్తాం. ఆదివారం మెరిసిన‌ ప్ర‌మిద‌ల ప్ర‌కాశం.. ఈ ప్ర‌పంచానికి కొత్త వెలుగునిస్తుందని ఆశిద్ధాం. సంఘీభావ‌మే స‌మాజాన్ని కాపాడుతుంది. క‌రోనా కారుచీక‌ట్ల నుంచి ఈ ప్ర‌పంచం బ‌య‌ట‌ప‌డాలంటే దానికి ఐక్య‌తే ఆయుధం. క‌నిపించ‌ని చీక‌టిలో ఒక‌రికి ఒక‌రు తోడున్నామ‌న్న సంకేతం ఇప్పుడు అత్య‌వ‌స‌రం. చీక‌ట్లో దీపాల‌ను వెలిగించి.. దివ్య‌జోతుల్ని ప్ర‌స‌రింప‌చేయ‌డం ఇప్పుడు కావాల్సిన సంఘీభావం. క‌రోనాపై పోరాటం చేస్తున్న ప్రపంచ‌దేశాల‌కు.. దీప‌కాంతుల‌తో సంఘీభావాన్నితెలిపి త‌మ‌లోని నిరాశ‌ల‌ను పార‌ద్రోలారు.
 
ఏదైనా కోరిక‌ తీరాలంటే దీపాన్ని వెలిగించి, ఆ దీపానికి నివేద‌న స‌మ‌ర్పించి, న‌మ‌స్క‌రించే ఆచారం మ‌నది. ఆదివారం జ‌రిగిన ఈ దీపారాధ‌న స‌ర్వాభీష్టాల‌ను సిద్ధింప‌చేస్తుంది. కాల‌కూట విషనాగుగా మారిన క‌రోనాను త‌రిమేందుకు ఈ దీప‌నివేద‌నే మ‌న‌కు శ‌క్తినిస్తుంది. దీపం వెలిగితే అదే దివ్య‌త్వం. క‌రోనా అంధ‌కారం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఆదివారం రాత్రి వెలిగించిన దీప‌జ్యోతుల ఆ ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని క‌లిగిస్తాయ‌ని స్మ‌రిద్దాం. క‌రోనా లాక్‌డౌన్ సంక్షోభ కాలంలో.. సంఘీభావాన్ని విడ‌వ‌కండి.. కానీ భౌతిక దూరాన్ని పాటించండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments