Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎం కేర్స్ నిధికి చైనా కంపెనీల నిధులు.. నిలదీసిన కాంగ్రెస్

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (11:11 IST)
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు చైనా నుంచి భారీగా నిధులు వస్తున్నాయంటూ బీజేపీ నేతలు చేసిన విమర్శలకు కాంగ్రెస్ నేతలు స్పందించారు. గత మార్చి నెలలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన పీఎం కేర్స్‌ నిధికి చైనాకు చెందిన కంపెనీలు భారీ మొత్తంలో నిధులు విరాళంగా ఇచ్చాయని కాంగ్రెస్ ఆరోపించింది. పైగా, ఈ నిధికి విరాళాలు ఇచ్చిన చైనా కంపెనీల జాబితాను కాంగ్రెస్ పార్టీ తాజాగా బహిర్గతం చేసింది. 
 
చైనా కంపెనీలు ఎన్నో పీఎం కేర్స్‌కు భారీగా నిధులు ఇచ్చాయని, ఆ దేశం కారణంగా జాతి భద్రతకు ప్రమాదం వాటిల్లుతున్న వేళ, ఆ డబ్బులు ఎందుకు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఈ మేరకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ఓ ప్రకటన విడుదల చేస్తూ, ఈ వివాదాస్పద నిధికి మే 20 నాటికి దాదాపు 9,678 కోట్లు వచ్చాయని వార్తలొచ్చాయని, ఈ డబ్బును ఎలా ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు.
 
అసలు చైనా కంపెనీల నుంచి నిధులను ఎందుకు తీసుకున్నారని నిలదీసిన ఆయన, ఈ నిధులు దారి మళ్లుతున్నాయని, అవి ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికీ తెలీదని ఆరోపించారు. కనీసం కాగ్ కూడా ఈ విషయంలో స్పందించడం లేదని మండిపడ్డారు.పీఎం కేర్స్ మోదీ సొంత నిధి అయిపోయిందని విమర్శలు గుప్పించారు. 
 
పీఎం కేర్స్‌కు హువావే నుంచి రూ.7 కోట్లు, టిక్ ‌టాక్‌ నుంచి రూ.30 కోట్లు, 38 శాతం చైనా భాగస్వామ్యం వున్న పేటీఎం నుంచి రూ.100 కోట్లు, షియోమీ నుంచి రూ.15 కోట్లు, ఒప్పో నుంచి రూ.1 కోటి పీఎం కేర్స్ కు విరాళంగా వచ్చాయా? లేదా? అని ప్రశ్నించారు.
 
కాగా, తాము పీఎం కేర్స్‌కు రూ.10 కోట్లు విరాళం ఇచ్చామని ఇటీవలి షియోమీ స్వయంగా ప్రకటించింది. ఒప్పో సంస్థ తాము కోటి రూపాయలు ఇచ్చామని అధికారికంగా వెల్లడించింది. పీఎం కేర్స్ నిధితో పాటు ఈ కంపెనీలు కొన్ని రాష్ట్రాల సీఎంల సహాయ నిధులకు కూడా కోట్ల రూపాయల విరాళాలు అందించాయి. 
 
చైనా దళాలు భారత భూభాగాన్ని ఆక్రమించాలని ప్రయత్నిస్తున్న వేళ, ఆ దేశ కంపెనీల నుంచి విరాళాలు స్వీకరించడం బాధాకరమని వ్యాఖ్యానించిన అభిషేక్, ప్రధాని తన పదవిని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments