ఆంధ్ర నుంచి ఆక్సిజన్ ప్లాంట్లు ప్రారంభిస్తా: సోనూ సూద్

Webdunia
శనివారం, 22 మే 2021 (19:55 IST)
తాను తలపెట్టిన ఆక్సిజన్​ ప్లాంట్ల ఏర్పాటును ఆంధ్రప్రదేశ్​ నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు సోనూసూద్. కర్నూలులో తొలి ప్రాధాన్యంగా ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
 
లాక్​డౌన్​ మొదలైనప్పటి నుంచి ఎంతోమందికి సాయం చేస్తున్న నటుడు సోనూసూద్​. తన ఆధ్వర్యంలోని తొలి సెట్​ ఆక్సిజన్​ ప్లాంట్లను ఆంధ్రప్రదేశ్​లో ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.
 
 కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి, నెల్లూరు ఆత్మకూరులోని జిల్లా ఆస్పత్రిలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే మిగతా రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్​ ప్లాంట్లను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా తనను కోరిన ఎంతోమందికి ఆక్సిజన్​ కాన్సట్రేటర్​లను అందించారు సోనూసూద్.
 
 ఇవి సరిపోకపోవడం వల్ల విదేశాల నుంచి ఆక్సిజన్​ ప్లాంట్లను తెప్పించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే తొలి ప్రాధాన్యంగా ఆంధ్రప్రదేశ్​లో ఆక్సిజన్​ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

The Girlfriend Review : రష్మిక మందన్నా నటించిన ది గాళ్ ఫ్రెండ్ రివ్యూ

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments