Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారంపై ఆమ్నెస్టీ లేదు... అదంతా ఉత్తుత్తి ప్రచారమే...

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (17:58 IST)
బంగారంపై పన్ను విధించనున్నారనే వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టంచేసింది. బడ్జెట్ తయారీకి ముందు ఇలాంటి వార్తలు రావడం సహజమేనని స్పష్టం చేసింది. 
 
బంగారంపై ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు సర్జికల్ స్ట్రైక్ చేయబోతుందంటూ గత కొన్ని రోజులుగా విస్తృతమైన ప్రచారం సాగుతోంది. పరిమితికి మించి బంగారం ఉంటే.. స్వచ్ఛందంగా వెల్లడించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ సరికొత్త పథకాన్ని తీసుకొస్తుందనే వార్తలు షికారు చేస్తున్నాయి. 
 
నల్లధనాన్ని బంగారం రూపంలో దాచుకునేవారికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త క్షమాభిక్ష (ఆమ్నెస్టీ) పథకానికి రూపకల్పన చేస్తున్నట్లు ఈ వార్తల సారాంశం. పరిమితికి మించి బంగారం ఉంటే స్వచ్ఛందంగా తెలియజేసేలా ఈ పథకాన్ని అమలు చేయబొతున్నారని.. దీని ప్రకారం.. పరిమితికిమించి బంగారం ఉన్నవాళ్లంతా దానిని బయటపెట్టి, అందుకు తగినంత పన్ను చెల్లించాల్సి ఉంటుందంటూ ప్రచారం జరుగుతోంది. 
 
ఈ ప్రచారం ఇపుడు దేశ వ్యాప్తంగా వైరల్ కావడంతో కేంద్ర ఆర్థిక శాఖ గురువారం స్పందించింది. అసలు బంగారంపై క్షమాభిక్ష పథకం తీసుకురావాలన్న ప్రతిపాదనేదీ ప్రస్తుతం లేదని క్లారిటీ ఇచ్చింది. సాధారణంగా బడ్జెట్‌ తయారీ సందర్భంగా ఇలాంటి ఊహాగానాలు రావడం సహజమేనంటూ సంబంధిత అధికారులు పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతానికి ఈ బంగారంపై నెలకొన్న టెన్షన్‌కు తాత్కాలిక ఉపశమనం కలిగినట్లే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments