విద్యుత్ తీగలపై నిల్చుని ఆకులు తింటున్న మేక- వీడియో వైరల్

సెల్వి
గురువారం, 10 ఏప్రియల్ 2025 (13:33 IST)
Goat
విద్యుత్ తీగలపై నిలబడి ఆకులు తింటున్న మేక వీడియో వైరల్‌గా మారింది. ఇది వీక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక తెల్ల మేక విద్యుత్ తీగలపై ప్రశాంతంగా నిల్చుని, ఆ తీగలపై వేలాడుతున్న కొన్ని ఆకులను తింటూ కనిపించింది. ఆ మేకలో ఏమాత్రం భయం కనిపించలేదు. 
 
ఈ వీడియోలో అనేక కేబుల్ లైన్లు, విద్యుత్ స్తంభాలతో కూడిన రహదారిని చూడవచ్చు. భూమి నుంచి ఆరు మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న కరెంట్ తీగపై నిలబడి ఉన్న మేకను జూమ్ చేస్తుంది. కేబుల్ వైర్‌కు తగులుకున్న గడ్డి తినడానికి ఆ మేక ముందుకు వంగి కనిపిస్తుంది. 
 
ఈ సంఘటన జరిగిన ఖచ్చితమైన ప్రదేశం తెలియరాలేదు. కానీ ఈ వీడియోను చూసిన వారంతా షాకవుతున్నారు. కరెంట్ తీగపై ఆ మేక ఎలా ఎక్కింది. అలా ఎక్కి ఏమాత్రం భయం లేకుండా గడ్డిని ఎలా మేస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మేకలు తరచుగా చెట్లు, కొండలను ఎక్కుతాయి. కానీ విద్యుత్ తీగలపై నిలబడిన ఆ మేక భయం లేకుండా ఎలా వుండగలుగుతోందని అడుగుతున్నారు. ఈ మేకను చూస్తూ వీధి జనం అవాక్కయ్యారు. 
 
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, మేక ఎలా పైకి చేరుకుంది? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. "ఇది AI- జనరేటెడ్ వీడియో" అని మరొకరు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments