రేవంత్ రెడ్డికి ఆ యోగం లేదని చెప్పిన వేణు స్వామిని ఆడుకుంటున్న నెటిజన్స్

ఐవీఆర్
శనివారం, 1 జూన్ 2024 (14:37 IST)
రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలే లక్ష్యంగా వేణు స్వామి భవిష్యత్ వివరాలు చెబుతుంటారు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి జాతకం చెబుతూ... రేవంత్ రెడ్డికి కేసీఆర్ తర్వాత అధిక ప్రజాదరణ వుంటుంది కానీ ఆయన 2024 ముగిసేవరకు కూడా ముఖ్యమంత్రి కాలేడు. ఆయన జాతకం అంత యోగ్యంగా ఏమీ లేదంటూ చెప్పారు. ఇప్పుడు ఈ వీడియోను నెటిజన్లు షేర్ చేస్తూ మజా చేసుకుంటున్నారు. కితకితలు పెట్టుకుంటూ నవ్వుకుంటున్నారు.
 
పవర్ స్టార్ విడాకులు తీసుకోవడం ఖాయం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వేణు స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అతని జాతకం ప్రకారం మూడోసారి విడాకులు తప్పవు. రాజకీయాలు చెప్పేవాళ్లు, చేసేవాళ్లు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని తన జోస్యాన్ని వివరించారు. వేణు స్వామి ప్రముఖుల కెరీర్, వ్యక్తిగత జీవితాలపై వ్యాఖ్యానించడం ద్వారా పాపులర్ అయ్యాడు. వివాదాస్పద జ్యోతిష్కుడిగా ఖ్యాతిని పొందాడు. జాతకం పేరుతో ప్రభాస్, పవన్ కళ్యాణ్, నాగ చైతన్య, అఖిల్, విజయ్ దేవరకొండ, ఇంకా చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. 
 
అయితే వేణు స్వామి చెప్పిన వాటిలో కొన్ని నిజమయ్యాయి. అలాగే టాలీవుడ్ స్టార్స్ కూడా తన క్లయింట్లుగా ఉన్నారు. రష్మిక మందన, నిధి అగర్వాల్, డింపుల్ హయాతి వంటి హీరోయిన్లు తమ కెరీర్‌లో ఎదగాలని పూజలు చేశారు. బాలకృష్ణతో పాటు పలువురు హీరోలు ఆయనతో పూజలు చేశారని తెలిపారు.
 
పవన్ కళ్యాణ్ భవిష్యత్తుపై వేణు స్వామి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మళ్లీ విడాకులు తీసుకుంటారన్నారు. ఆయన జాతకం ప్రకారం 2024లో మూడోసారి విడాకులు తీసుకోనున్నారని తెలిపారు. సినిమా కెరీర్ పరంగా జాతకం అద్భుతంగా ఉంది. వ్యక్తిగత సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మాటలు వింటాడు. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే మార్గం వెతకడం లేదు. పవన్ కళ్యాణ్ సీఎం అయితే సంతోషించే వారిలో తాను కూడా ఒకడినని అన్నారు. 
 
కానీ పవన్ కళ్యాణ్ మాటలను తప్పుగా అర్థం చేసుకుంటూ ఆయన అభిమానులు విమర్శలు చేస్తున్నారని వేణు స్వామి అన్నారు. వేణు స్వామి ప్రకారం, పవన్ కళ్యాణ్ తన మూడవ భార్య అన్నాలెజినోవా నుండి కూడా విడాకులు తీసుకుంటారట. అది కూడా ఈ ఏడాది. వేణు స్వామి పవన్ కళ్యాణ్‌కు గతంలో కూడా రాజకీయ భవిష్యత్తు లేదని చెప్పడం కొసమెరుపు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments