Webdunia - Bharat's app for daily news and videos

Install App

గడ్డం గీయించినా.. గొంతు కోసినా మేం ముస్లింలగానే ఉంటాం : ఓవైసీ

ఉత్తరభారతంలోని పలు రాష్ట్రాల్లో ముస్లింలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా, గోవులను అక్రమంగా తరలిస్తున్నారో... గొడ్డు మాంసం ఆరగిస్తున్నారనో.. గడ్డం పెంచారనో ఇలా ఏదో కారణంతో కొన్ని అల్లరి మూకలు

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (12:21 IST)
ఉత్తరభారతంలోని పలు రాష్ట్రాల్లో ముస్లింలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా, గోవులను అక్రమంగా తరలిస్తున్నారో... గొడ్డు మాంసం ఆరగిస్తున్నారనో.. గడ్డం పెంచారనో ఇలా ఏదో కారణంతో కొన్ని అల్లరి మూకలు దాడులకు పాల్పడుతున్నారు.
 
ఈనేపథ్యంలో తాజాగా హర్యానాలో బలవంతంగా ఓ ముస్లిం యువకుడికి గుర్తు తెలియని వ్యక్తులు.. గడ్డం గీయించారు. ఇది వివాదాస్పదమైంది. దీనిపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సోమవారం స్పందించారు. 
 
హర్యానాలో ముస్లిం యువకుడికి గడ్డం గీయించిన వ్యక్తులకు, వారి తల్లిదండ్రులకు తాను చెప్పేది ఒక్కటే.. మీరు మా గొంతు కోసినా కూడా.. తాము ముస్లింల లాగానే ఉంటామని ఓవైసీ తేల్చిచెప్పారు. తాము మిమ్మల్ని ఇస్లాం మతంలోకి మార్చి గడ్డం పెంచామని చెబితే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనల వల్ల దేశంలో అశాంతి పెరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments