ముంబైను ముంచెత్తున్న భారీ వర్షాలు : అంథేరీలో కూలిన వంతెన

ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాలతో ముంబై నగర వాసుల జనజీవనం అస్తవ్యస్తమైంది. అనేక లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇదిలావుంటే ఈ వర్షాల ధాటికి అంథేరీ ప్రాంతంలోని ఓ రైల్వే వంతె

Webdunia
మంగళవారం, 3 జులై 2018 (11:02 IST)
ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాలతో ముంబై నగర వాసుల జనజీవనం అస్తవ్యస్తమైంది. అనేక లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇదిలావుంటే ఈ వర్షాల ధాటికి అంథేరీ ప్రాంతంలోని ఓ రైల్వే వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
 
మరోవైపు, ఈ ప్రమాదం కారణంగా ఈస్ట్ వెస్ట్ ప్రాంతాలకు వెళ్లే అన్ని రకాల రైలు సేవలను నిలిపివేశారు. అలాగే, కూలిన వంతెన వద్ద భారీ సంఖ్యలో రైల్వే పోలీసులతో పాటు అగ్నిమాపకదళ సిబ్బందిని నియమించారు. 
 
మరోవైపు ముంబై భారీ వర్షాలకు అనేక లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ముఖ్యంగా, శ్యాం తలావ్, హింద్ మట, ఒబేరాయ్ మాల్, సీఎస్టీ రోడ్డు, కుర్లా, మాహిమ్ జంక్షన్, నెహ్రూనగర్ బ్రిడ్జి, శాంతాక్రజ్, చెంబూర్ లింక్ రోడ్డు ప్రాంతాల్లో వరద నీరు నిలిచింది. ఈ నీటిని తొలగించే పనుల్లో ముంబై కార్పొరేషన్‌కు చెందిన పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments