Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ స్థానమెంత?

Webdunia
గురువారం, 23 జులై 2020 (08:55 IST)
భారత పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. కరోనా కష్టకాలంలోని రిలయన్స్ జియో ఫ్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడులు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. దీంతో ముఖేష్ సంపద ఒక్కసారిగా పెరిగిపోయింది. ఫలితంగా ఆయన ప్రపంచ ధనవంతుల జాబితాలో మరో మెట్టు ఎక్కారు. ఫోర్బ్స్‌ రియల్‌ టైం రిచ్‌ లిస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానానికి ఎగబాకారు. 
 
ఈ రియల్ టైమ్ రిచ్ లిస్ట్ జాబితా ప్రకారం ముఖేష్ అంబానీ సంపద బుధవారం నాటికి 7,510 కోట్ల డాలర్లకు పెరిగింది. ప్రస్తుత మారకం రేటు (డాలర్‌కు రూ.74.76) ప్రకారం.. మన కరెన్సీలో ఈ విలువ రూ.5,61,447 కోట్లుగా ఉంది. ఇకపోతే, అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బేజోస్‌ 18,490 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌తో ఈ కుబేర జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. 
 
ఇకపోతే, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌ (11,350 కోట్ల డాలర్లు) రెండు, లూయిస్‌ విట్టన్‌ ఛైర్మన్‌, సీఈఓ బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ అండ్‌ ఫ్యామిలీ మూడో స్థానంలో ఉన్నారు. ఫేస్‌బుక్‌ సహ వ్యవస్థాపకులు, సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ 8,790 కోట్ల డాలర్ల ఆస్తితో నాలుగో స్థానంలో ఉన్నారు. 
 
రిలయన్స్‌ షేర్లు రికార్డు ర్యాలీ సాధించడం ముకేశ్‌ వ్యక్తిగత సంపద అనూహ్యంగా పెరగడానికి దోహదపడింది. ఈ మధ్యకాలంలో ఆయన కుబేరుల జాబితాలో వారెన్‌ బఫెట్‌, టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌, గూగుల్‌ వ్యవస్థాపకులు ల్యారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌ను వెనక్కి నెట్టేసిన ముఖేష్ అంబానీ ఇపుడు ఐదో స్థానంలో నిలిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments