Webdunia - Bharat's app for daily news and videos

Install App

దావోస్ వేదికపై అరుదైన కలయిక - సెటైర్లు వేస్తున్న నెటిజన్లు

Webdunia
మంగళవారం, 24 మే 2022 (10:01 IST)
దావోస్ వేదికగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలు కలుసుకున్నారు. ఈ అరుదైన కలయికకు సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, నెటిజన్లు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కేటీఆర్, జగన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే, దావోస్ వేదికగా కలుసుకున్న ఈ ఇద్దరు నేతలు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఈ సందర్భంగా "ఏపీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డితో గొప్ప సమావేశం జరిగింది" అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే, వీరిద్దరు ఏయే అంశాలపై చర్చించారన్న విషయం మాత్రం గోప్యంగా ఉంచారు.
 
ఇదిలావుంటే, దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక మండలి సదస్సులో పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం జగన్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి.
 
అదేవిధంగా మంత్రి కేటీఆర్‌ కూడా తెలంగాణ పెట్టుబడుల ఆహ్వాన విషయంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు లూలు గ్రూపు అధిపతి యూసుఫ్‌ అలీ ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments