Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగ్న చిత్రాలను పంపమని కోరిన ట్రోలర్.. చిన్మయి ఏం చేసిందో తెలుసా?

Webdunia
బుధవారం, 22 మే 2019 (11:35 IST)
దక్షిణాదిన మీటూ ఉద్యమాన్ని లేవనెత్తిన గాయని చిన్మయి గురించి తెలిసిందే. తమిళ గేయ రచయిత వైరిముత్తుపై 'మీటూ' ఆరోపణలు చేసి వార్తల్లోకి ఎక్కింది. అయితే చిన్మయి ఆరోపణలను వైరముత్తు ఖండించారు. అయినా వైరముత్తును చిన్మయి వదల్లేదు.


వైరముత్తుపై ఆరోపణల నేపథ్యంలో డబ్బింగ్ ఆర్టిస్టు నుంచి కూడా ఆమెను తొలగించారు. తాజాగా నెట్టింట తనను వేధించాలని చూసేవారికి తనదైన శైలిలో పంచ్‌లు ఇస్తుండే ఆమె, ఓ ట్రోలర్‌కు బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది. తనకు కొన్ని నగ్న చిత్రాలను పంపాలని ట్రోలర్ కోరాడు. 
 
అడిగిందే అదనుగా 'ఇవే నా ఫేవరెట్ న్యూడ్స్' అంటూ 'న్యూడ్' సంస్థ విక్రయించే లిప్ స్టిక్, ఐబ్రో పెన్సిల్స్ బొమ్మలను పోస్ట్ చేసింది. ఇక దీన్ని చూసిన ఎంతో మంది నెటిజన్లు, చిన్మయి సమయస్ఫూర్తితో వ్యవహరించిందని, దీంతో ఆ ట్రోలర్ ఇక ఏమీ మాట్లాడలేని పరిస్థితి నెలకొందని కామెంట్లు చేస్తున్నారు. ట్రోలర్లకు చిన్మయి సరిగ్గా బుద్ధి చెప్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. 
 
అంతేగాకుండా ఇటీవల ఓ మహిళ తనతో షేర్ చేసుకున్న వేధింపులకు సంబంధించిన ఫోటోలను కూడా ట్విట్టర్‌లో షేర్ చేసింది. సైకాలజిస్ట్ వద్ద వెళ్లిన ఓ వివాహితను ఆ సైకాలజిస్ట్ వేధించిన తీరును చిన్మయి ట్విట్టర్ ద్వారా ఎండగట్టింది. చికిత్స కోసం వెళ్లిన వివాహిత వద్ద అంతరంగిక విషయాలను అడిగాడని.. వైద్యుడు కావడంతో చెప్పానని.. అన్నీ అడిగి తెలుసుకున్న ఆ వ్యక్తి చివర్లో భర్తను వదిలేయమన్నాడని చిన్మయి తన పోస్టులో వెల్లడించింది. 
 
భర్తతో జీవించడం కంటే.. అక్రమ సంబంధంతో ముందుకు సాగడం బెటరని ఆ వైద్యుడు సదరు మహిళకు సలహా ఇచ్చాడని చిన్మయి తన పోస్టులో వెల్లడించింది. ఇలాంటి వైద్యులు వుండటం వైద్యవృత్తికే కళంకమని చిన్మయి తెలిపింది. ఇలాంటి ఎందరో ప్రబుద్ధులు మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారని చిన్మయి ఆ పోస్టులో వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం