Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ కోసం ఆస్తులు వదులుకుంది.. ఇప్పుడు తల్లిదండ్రులు విడాకుల కోసం..?

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2023 (09:20 IST)
Malaysian Woman
ప్రేమకోసం ఆస్తులను వదులుకున్న యువతి కథే ఇది.. వేల కోట్ల ఆస్తి వున్నప్పటికీ ప్రేమ కోసం అన్నీ వదులుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏంజెలిన్ ఫ్రాన్సిస్ ఖూ అనే మహిళ ఉన్నత స్థాయి కుటుంబంలో జన్మించింది. 
 
ఏంజెలిన్ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసింది. ఆ సమయంలో జెడియా అనే యువకుడితో ప్రేమలో పడింది. ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలియజేయగా, వారు అంగీకరించలేదు. ఇంకా ప్రేమ కావాలంటే ఆస్తులు వదులకోమన్నారు. 
 
అయితే, ప్రేమకే ఓటేసిన ఏంజెలిన్ ప్రియుడి వెంట వెళ్లిపోయింది. ఓ సాదాసీదా అమ్మాయిలా పెళ్లి చేసుకుని జీవనం సాగిస్తోంది. ఇది జరిగి కొన్నేళ్లైన తర్వాత ఏంజెలిన్ మళ్లీ వార్తల్లోకెక్కింది. ఇటీవల ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. 
 
కోర్టులో వాంగ్మూలం ఇచ్చేందుకు ఏంజెలిన్ కోర్టుకు వచ్చింది. తల్లి గురించి మంచిగా చెప్పిన ఏంజెలిన్... తండ్రిపై మాత్రం విమర్శలు చేసింది. ఏదేమైనా, తల్లిదండ్రులు విడిపోవడం తనకు ఇష్టం లేదని చెప్పింది. వారు మళ్లీ కలిస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments