Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌మ‌ణా... చెక్ పోస్ట్ పడుద్దీ, త్వరగా కారెక్కూ, ఆ మాటతో సరిలేరు నీకెవ్వరనిపించాడుగా...

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (13:55 IST)
రమణా చెక్ పోస్ట్ పడుద్దీ లోడెత్తూ అంటాడు ఓ చిత్రంలోని నటుడు. అలాగే జరిగిపోయిందిక్కడ. తెలుగుదేశం పార్టీలో వుంటే ఇక పొలిటికల్ కెరీర్‌కు చెక్ పోస్ట్ పడుతుందని భావించినట్లున్నారు ఎల్. రమణ, అందుకే  బహుశా తెలుగుదేశం పార్టీకి ఇలాంటి లేఖతో షాకిచ్చారు.

చాలా చక్కగా నేను పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరుతున్నానంటూ పేర్కొన్నారు. సహజంగా ఏ రాజకీయ నాయకుడూ మరో పార్టీలో చేరుతున్నానంటూ రాజీనామా లేఖ ఇచ్చిన దాఖలాలు ఇప్పటివరకూ లేవు. రమణ మాత్రం అలాంటి మాటతో సరిలేరు నీకెవ్వరూ అనిపించేసారు.
 
తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎల్ రమణ రాజీనామా చేసేశారు. గ‌త కొద్ది నెల‌లుగా కొన‌సాగుతున‌న ఉత్కంఠ‌కు తెర దించేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు త‌న రాజీనామా లేఖ‌ను పంపారు. అంతే కాదు... తాను తెలంగాణా రాష్ట్ర స‌మితిలో చేరుతున్నానని చంద్రబాబుకు రాజీనామా లేఖలో చ‌క్క‌గా పేర్కొన్నారు. టీడీపీకి రాజీనామా, టీఆర్ఎస్‌లో చేరుతున్నా అంటూ నిర్మొహ‌మాటంగా తేల్చేశారు ఎల్. రమణ.
తెలంగాణాలో ఇది అంతా ఊహించినట్టే జరిగింది. కేసీఆర్ తో  రమణ భేటీ అయిన వెంట‌నే, త్వరలోనే ఆయన టీఆర్ఎస్ లో చేరనున్నార‌ని తేలిపోయింది. అయితే, నేడు లాంఛ‌నంగా రమణ త‌న రాజీనామా ప్ర‌క‌టించ‌డంతో... తెలంగాణాలో టీడీపీ దాదాపు ఖాళీ అయిపోయే ప‌రిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్ర పార్టీ అధ్య‌క్షుడే రాజీనామా చేస్తే, ఇక పార్టీలో మామూలు వాళ్ళు ఎలా ఉండ‌గ‌లుగుతార‌ని తెలంగాణా టీడీపీ చోటా మోటా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు చ‌ల్లగా జారుకుంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments