Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ ఉడకలేదే.. కేఎఫ్‌సీపై కస్టమర్ ఫిర్యాదు.. ఇలాంటి ఆహారాన్ని తింటే..?

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (17:54 IST)
KFC
కేఎఫ్‌సీ చికెన్ అంటే అందరూ లొట్టలేసుకుని తింటారు. టేస్ట్‌లోనే కాదు కస్టమర్‌కి ఇచ్చే సర్వీస్ విషయంలోనూ కేఎఫ్‌సీకి మంచి పేరుంది. చికెన్‌.. రుచిగా లేదని ఫిర్యాదు చేసినా సరిగా ఉడకలేదని చెప్పినా.. కంపెనీ వెంటనే స్పందిస్తుంది. 
 
అయితే.. అలాంటి కేఎఫ్‌సీ నుంచి తాజాగా ఓ కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. సరిగా ఉడకని చికెన్‌ పీస్‌లను సిబ్బంది వడ్డించారు. పైగా నిర్లక్ష్యంగానూ వ్యవహరించారు. ఈ విషయాన్ని కస్టమర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపాడు. ఫిర్యాదు చేసినా.. సిబ్బంది కనీసం పట్టించుకోలేదని వాపోయాడు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఈ ఘటన జరిగింది.
 
సాయితేజ అనే వ్యక్తి కూకట్‌పల్లిలోని కేఎఫ్‌సీ సెంటర్‌కు వెళ్లాడు. చికెన్‌ ఆర్డర్‌ ఇచ్చాడు. కేఎఫ్‌సీ సిబ్బంది అతడికి సర్వ్ చేశారు. అయితే అతడికి ఇచ్చిన చికెన్ బాగోలేదు. సరిగా ఉడకని చికెన్‌ పీస్‌లను సర్వ్‌ చేశారు. చికెన్ ఇలా ఉందేంటి అని సాయితేజ సిబ్బందిని అడిగాడు. దీని గురించి వారికి ఫిర్యాదు చేశాడు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. వారి నుంచి ఎలాంటి స్పందనా లేదు.
 
దీంతో అతడీ విషయాన్ని ట్విట్టర్‌‌లో పోస్టు చేశాడు. తన గోడు వెళ్లబోసుకున్నాడు. హైదరాబాద్‌ జేఎన్‌టీయూ మెట్రో కేఎఫ్‌సీ స్టోర్‌ నుంచి తీసుకున్న చికెన్‌లో నాణ్యత లేదని.. పీస్ అస్సలు ఉడకలేదంటూ సాయి తేజ వాపోయాడు. తాను డిస్పాయింట్ అయినట్టు తెలిపారు. ఇలాంటి ఆహారాన్ని తింటే కస్టమర్లకు కడుపు నొప్పి సమస్యలు వస్తాయన్నాడు. దీనిపై పరిశీలన చేయాలని కోరుతూ కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ను ట్యాగ్‌ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

'పుష్ప 2' చిత్ర టికెట్ ధరల పెంపునకు టి సర్కారు అనుమతి

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments