Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టికల్ 370 : కేంద్రానికి సుప్రీం షాక్.... జమ్మూకాశ్మీర్‌కు చీఫ్ జస్టీస్

Webdunia
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (14:00 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఆర్టికల్ 370 రద్దు విషయంలో కేంద్రానికి సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. పైగా, ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్న అంశాన్ని తెలుసుకునేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ స్వయంగా జమ్మూకాశ్మీర్‌లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆయన సోమవారం స్వయంగా ప్రకటించారు. 
 
జమ్ము కాశ్మీర్‌ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. అక్కడ తీవ్ర విపత్కర పరిస్థితులు నెలకొని ఉన్నాయన్న పిటిషనర్ల వాదనకు స్పందించింది. ఈ కేసులో స్వయంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ రంజన్ గొగోయ్ జమ్ము కశ్మీర్‌లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు.
 
అలాగే, తన కుటుంబాన్ని కలుసుకునేందుకు అనుమతించాలని పిటిషన్ వేసిన కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే నాలుగు జిల్లాల్లో పర్యటించేందుకు కూడా అనుమతిని మంజూరు చేసింది.
 
అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కాశ్మీర్‌లో పరిస్థితి బాగానే ఉందంటూ కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిన నేపథ్యంలో అక్కడి పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయంటూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. 
 
కాశ్మీర్ లోయ ప్రాంతంలో చిన్నారులను బయటకు రానివ్వడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై .. ఈ విషయంపై సుప్రీం సీరియస్ అయ్యింది. నిజంగా ఇందులో నిజమెంతో స్వయంగా తెలుసుకోవాలని అనుకుంటున్నట్టుగా వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత నెలకొన్న పరిస్థితులపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారించి ఈ నిర్ణయం తీసుకుంది. 
 
అలాగే, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పర్యటించేందుకు తనకు అనుమతి ఇచ్చిందుకు గులాం నబీ ఆజాద్ సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఆయన తన స్వరాష్ట్రమైన జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి అత్యవసరంగా వెళ్లనున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments