టెన్ష‌న్‌లో జూనియర్ ఎన్టీఆర్... ఎందుకో తెలుసా..?

Webdunia
శనివారం, 17 నవంబరు 2018 (15:36 IST)
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్...ఇప్పుడు చాలా టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. అర‌వింద స‌మేత స‌క్స‌స్ అయ్యింది. రాజ‌మౌళితో భారీ మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టిస్తున్నారు. ఇక టెన్ష‌న్ ఎందుకు అంటారా..? విష‌యం ఏంటంటే.. గ‌త కొంతకాలంగా ఎన్టీఆర్ రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ సినిమాల మీదే దృష్టి పెట్టారు. ఇటీవ‌ల తండ్రి నంద‌మూరి హ‌రికృష్ణ చ‌నిపోవ‌డంతో అప్ప‌టివ‌ర‌కు దూరంగా ఉన్న బాబాయ్ బాల‌య్య‌, మావ‌య్య చంద్ర‌బాబు ఎన్టీఆర్‌కి బాగా ద‌గ్గ‌ర‌య్యారు.
 
ఈ నేప‌ధ్యంలో తెలంగాణ‌లోని కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ని పోటీ చేయించాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించారు కానీ.. క‌ళ్యాణ్ రామ్ సున్నితంగా తిర‌స్క‌రించారు. అయితే.. ఊహించ‌నివిధంగా హ‌రికృష్ణ కుమార్తె సుహాసినిని ఎన్నిక‌ల బ‌రిలో దించారు చంద్ర‌బాబు. కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి నంద‌మూరి సుహాసినిని పోటీ చేయిస్తున్నారు. ఇదే ఎన్టీఆర్‌ని బాగా టెన్ష‌న్ పెడుతున్న విష‌యం. 
 
ఎందుకంటే.. ప్ర‌స్తుతం రాజ‌కీయాల మీద ఎన్టీఆర్‌కి అంత‌గా ఆస‌క్తి లేదు. ఇలాంటి టైమ్‌లో సోద‌రి సుహాసిని ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం... ప్ర‌చారానికి రావాల‌ని పిలిస్తే ఏం చేయాలి..? వెళితే ఎలా ఉంటుంది..? వెళ్ల‌క‌పోతే ఎలా ఉంటుంది..? అని ఆలోచిస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది.  మ‌రి.. ఎన్టీఆర్.. సోద‌రి సుహాసిని గురించి ఏం చెబుతారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments