Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యనగరం చాలా కాస్ట్లీ గురూ...!

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2023 (07:49 IST)
హైదరాబాద్ నగరం (భాగ్యనగరి) చాలా ఖరీదైన నగరం జాబితాల్లో చేరిపోయింది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా, బహుళజాతి సంస్థల ఉద్యోగులకు ఇది ఖరీదు నగరంగా నిలిచింది. మొత్తం 227 నగరాల్లో చేసిన సర్వేలో భాగ్య నగరానికి 202వ స్థానం దక్కింది. రవాణా, నివాసం, ఆహారం, దుస్తులు, వినోదం, దుస్తులు, గృహోపకరణాలు తదితర 200 అంశాలు ప్రాతిపదికన మెర్సర్ సంస్థ 2023 సంవత్సరానికి ఈ సర్వే నిర్వహించింది. 
 
ఇందులో భారత్ నుంచి ముంబై 147, ఢిల్లీ 169, చెన్నై 184, బెంగళూరు 189, కోల్‌కతా 211, పుణె 213 స్థానాల్లో నిలిచాయి. నివాస వ్యయం ముంబైతో పోలిస్తే చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, పుణెలో 50 శాతం తక్కువని నివేదిక పేర్కొంది. భారత్‌లో విదేశీయులకు నివాస వ్యయం అత్యంత ఎక్కువుండే నగరం ముంబై అయితే.. తక్కువ ఉండే నగరం కోల్‌‍కతా అని ఈ సర్వే ద్వారా వెల్లడైంది. 
 
మరోవైపు విదేశీయులకు ప్రపంచంలో ఖరీదైన నగరాలుగా హాంకాంగ్, సింగపూర్, జ్యూరిచ్ టాప్‌లో ఉన్నాయి. విదేశాల్లో కార్యకలాపాలు సాగించాలని చూసే బహుళజాతి సంస్థలకు భారత్‌లో ముంబై, ఢిల్లీ నగరాలు తగినవని మెర్సర్ నివేదిక తేల్చింది. తక్కువ జీవన వ్యయం, ఇతర ఖర్చులను దీనికి నేపథ్యంగా చూపింది. కాగా, ఈ ఏడాది సర్వేలో ప్రవాసులకు ఆసియాలో అత్యంత ఖరీదైన టాప్ 35 నగరాల్లోనూ ముంబై, ఢిల్లీ ఉన్నాయి. ముంబై నిరుడు 26వ స్థానంలో ఉండగా ఈసారి 27కు పడిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments