Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమికి మరో ముప్పు : దూసుకొస్తున్న గ్రహశకలం

Webdunia
గురువారం, 22 జులై 2021 (18:16 IST)
భూమికి మరో ముప్పు పొంచివుంది. ఓ గ్రహ శకలం మెరుపు వేగంతో భూమివైపు దూసుకొస్తుంది. ఇది ఈ నెల 24వ తేదీన భూమిని దాటి వెళ్లిపోవచ్చని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వెల్ల‌డించింది. దీనికి 2008 గో20గా నామకరణం చేశారు.
  
ఈ గ్రహశకలం ఓ స్టేడియం ప‌రిమాణం లేదా తాజ్‌మ‌హ‌ల్ కంటే మూడు రెట్లు పెద్ద‌గా ఉంద‌ని నాసా శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. గంట‌ల‌కు 18 వేల మైళ్ల వేగంతో అంటే సెక‌ను 8 కిలోమీట‌ర్ల వేగంతో ఇది భూమి వైపు దూసుకొస్తున్న‌ట్లు నాసా చెప్పింది.
 
ఈ స్పీడు కార‌ణంగా ఆస్ట‌రాయిడ్‌కు అడ్డుగా వ‌చ్చే ఏదైనా ధ్వంస‌మైపోతుంద‌ని స్పేస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ఆస్ట‌రాయిడ్ వ్యాసం 220 మీట‌ర్లుగా ఉంది. ఇది భూమికి 28 ల‌క్ష‌ల‌ కిలోమీట‌ర్ల దూరం నుంచి వెళ్ల‌నుంది.
 
అంటే ఇది భూమి, చంద్రుడికి మ‌ధ్య ఉన్న దూరం కంటే ఎనిమిది రెట్లు. అయితే ఈ ఆస్ట‌రాయిడ్ సుర‌క్షితంగా భూమిని దాటి వెళ్లిపోతుంద‌ని నాసా తెలిపింది. అయితే ఈ ఆస్ట‌రాయిడ్ క‌క్ష్య‌ను అపోలోగా వ‌ర్గీక‌రించారు. ఈ కేట‌గిరీ ఆస్టరాయిడ్లు చాలా ప్ర‌మాద‌క‌రం. దీంతో ఈ ఆస్ట‌రాయిడ్ క‌ద‌లిక‌ల‌ను నాసా చాలా జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తోంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments