ఉక్రెయిన్ నుంచి భారత్‌ పౌరుల తరలింపు - రొమేనియా నుంచి బయలుదేరిన విమానం

Webdunia
శనివారం, 26 ఫిబ్రవరి 2022 (16:22 IST)
ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. దీంతో ఉక్రెయిన్‌లో భారతీయ పౌరులు, విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన రొమేనియాకు ప్రత్యేక విమానాలను నడుపుతుంది. ఇక్కడ నుంచి ఓ విమానం కూడ బయలుదేరింది. ఇందులో 219 మంది వస్తున్నారు. వీరిలో అనేక తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచనలు పాటిస్తూ రొమేనియా సరిహద్దులకు చేరుకున్న 219 మంది భారతీయులను ఆ విమానం ద్వారా ముంబైకు పంపినట్టు ఆయన తెలిపారు. అలాగే, ఉక్రెయిన్‌లో మిగిలిన భారతీయులను కూడా సురక్షితంగా భారత్‌కు తరలించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియను స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నట్టు మంత్రి జైశంకర్ వెల్లడించారు. అలాగే, భారతీయ పౌరులను తరలింపులో పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న రొమేనియా విదేశాంగ మంత్రి బోగ్డాన్ అరెస్కూకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anushka Shetty: స్వీటీ అనుష్క శెట్టి పెళ్లి చేసుకుంటుందా?

Ustaad Bhagat Singh: ఎంటర్ టైన్ మెంట్, దేశభక్తి కలగలిపిన ట్రైలర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ఆకట్టుకున్నాడు

మేడ్ ఇన్ కొరియా చిత్రీకరణ ఆనందించదగ్గ అనుభవం : ప్రియాంక మోహన్.

S.P. Charan: ఎస్పీ చరణ్, కేఎస్ చిత్ర పాడిన మెలోడీ బంగారు బొమ్మ సాంగ్ రిలీజ్

Rashmika: విజయ్ దేవరకొండ కోసం పోరాటం చేసిన రష్మిక మందన్న వీడియో రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పొట్ట మసాజ్, ప్రయోజనాలు ఏమిటి?

డయాబెటిస్‌, గుండె, మూత్రపిండాల ప్రమాదాలను ముందస్తుగా గుర్తించడానికి అబోట్ ICRAS సాధనం

నల్ల ద్రాక్షలో వున్న పోషకాలు ఏమిటి? వాటి ప్రయోజనాలు ఏమిటి?

అల్లంతో గృహవైద్యం అంటారు, ఎందుకు?

కొలెస్ట్రాల్‌ను కరిగించే బొప్పాయి, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం