Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ‌మౌళి హీరోలైనా... ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే!

Webdunia
గురువారం, 1 జులై 2021 (11:38 IST)
ట్రాఫిక్ రూల్స్ పాటించ‌క‌పోతే... ఎవ‌రికైనా ఎప్పుడైనా యాక్సిడెంట్లు సంభ‌వించొచ్చు. దానికి పాన్ ఇండియా క్రియేటివ్ డైర‌క్ట‌ర్ రాజ‌మౌళి హీరోలైనా అతీతులు కాదంటున్నారు... సైబ‌రాబాద్ పోలీసులు. అన‌డ‌మే కాదు... ఇది త‌ప్పు...ఇది ఒప్పు అని ఏకంగా హీరోల‌కే ట్రాఫిక్ పాఠాలు నేర్పిస్తున్నారు.
 
ఇటీవ‌ల ఆర్.ఆర్.ఆర్. కొత్త పోస్ట‌ర్‌ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి విడుద‌ల చేసిన వెంట‌నే... సైబ‌రాబాద్ పోలీసులు అల‌ర్ట్ అయిపోయారు. ఆ సినిమా హీరోలైన జూనియ‌ర్ ఎన్టీయార్, రామ్ చ‌ర‌ణ్‌లు ట్రాఫిక్ రూల్స్‌ని అతిక్ర‌మిస్తున్నార‌ని గుర్తించారు. అంతే... దానిని తామే క‌రెక్ట్ చేయ‌డానికి ఉప‌క్ర‌మించారు.
 
జూనియ‌ర్ ఎన్టీయార్, రామ్ చ‌ర‌ణ్‌లు ఇలా బులెట్ పైన హెల్మెట్లు లేకుండా రాష్‌గా డ్రైవ్ చేసుకుని వెళ్తుంటే, చూస్తూ ఊరుకుంటామా? అంటూ, వారిద్ద‌రికీ హెల్మెట్లు తొడిగారు. అంతేకాదు... కోవిడ్ నిబంధ‌న‌లు కూడా ఈ హీరోలు పాటించ‌డం లేద‌ని గుర్తించారు. వారిద్ద‌రికీ మాస్కులు కూడా తొడిగారు.
 
ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి విడుద‌ల చేసిన ఆర్.ఆర్.ఆర్. మూవీ పోస్ట‌ర్‌ని క‌రెక్ష‌న్ చేసి, సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు త‌మ‌దైన శైలిలో పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు. మ‌రి ఇపుడైనా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి త‌న సినిమా షూటింగ్‌లో కోవిడ్ నిబంధ‌న‌లు, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారా? లేదా అనేది... ఆర్. ఆర్.ఆర్. రిలీజ్ అయ్యాక‌... వెండితెర‌పై చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంటెస్ట్ ద్వారా డ్రింకర్ సాయి 31న మంచి పార్టీ ఇస్తాడు

నింద చిత్రానికి అంతర్జాతీయ స్ట్రీమింగ్ కి ఆమోదం

మ్యాడ్ స్క్వేర్ చిత్రం నుండి స్వాతి రెడ్డి.. గీతం విడుదల

అమెరికా, ఆస్ట్రేలియా లో కూడా రిలీజ్ కాబోతున్న పా.. పా.. మూవీ

ట్రెండింగ్‌లో సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీ ఫన్నీ వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

తర్వాతి కథనం
Show comments