వామ్మో.. సుజనా చౌదరి రూ.5700 కోట్లకు పైగా మోసం చేశారా?

Webdunia
ఆదివారం, 25 నవంబరు 2018 (10:34 IST)
టీడీపీ ఎంపీ సుజనా చౌదరి భారీ మోసానికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఈ మేరకు ఎంపీ సుజనా చౌదరికి ఈడీ సమన్లు జారీ చేసింది.  సుజనా గ్రూప్ కంపెనీలు రూ.5700 కోట్లకు పైగా మోసం చేసినట్లు ఈడీ గుర్తించింది. దీంతో ఈ నెల 27వ తేదీన తమ కార్యాయం ముందు హాజరు కావాల్సిందిగా ఈడీ ఆదేశాలు జారీ చేసింది. 
 
రెండు రోజుల పాటు ఐటీ, ఈడీ అధికారులు సుజనా కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్న వేళ.. టెస్టు క్రోప్టన్ అండ్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ లిమిటెడ్‌పై ఫిర్యాదు చేశాయి. సెంట్రల్ బ్యాంక్ నుంచి రూ.133 కోట్లు, ఆంధ్రా బ్యాంకు నుంచి రూ.71 కోట్లు, కార్పొరేషన్ బ్యాంక్ నుంచి రూ.159 కోట్ల రుణాలను తీసుకుని బ్యాంకులను మోసం చేసినట్లు ఫిర్యాదు చేయడంతో సీబీఐ రంగంలోకి దిగి విచారణ జరిపింది. ఈ కేసులో భాగంగానే రెండు రోజులుగా, ఐటీ, ఈడీ అధికారులు సుజనా కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. 
 
సుజనా చౌదరి ఉపయోగిస్తున్న ఆరు కార్డులు కూడా నకిలీ కంపెనీలపై రిజిస్ట్రేషన్ అయినట్టుగా ఈడీ ప్రకటించింది. నాగార్జున హిల్స్‌లో వివిధ షెల్ కంపెనీల్లో 126 రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. ఇవి కూడా సుజనా గ్రూపుకు చెందినవిగా ఈడీ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర డియోల్ ఇకలేరు

వంద కోట్ల మార్కులో వరుసగా మూడు చిత్రాలు.. హీరో ప్రదీప్ రంగనాథన్ అదుర్స్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments