Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిఘా కన్నుగప్పాడు.. కానీ కుక్క కంటికి చిక్కిపోయాడు...

Webdunia
మంగళవారం, 29 అక్టోబరు 2019 (17:37 IST)
ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ అబుబాకర్ అల్ బాగ్దాదీని సిరియా డెమెక్రటిక్ దళాల సహకారంతో అమెరికా భద్రతా బలగాలు హతమార్చాయి. అయితే, బాగ్దాదీ ఆచూకీ కనిపెట్టేందుకు నిఘా నేత్రాలు సైతం విఫలమయ్యాయి. కానీ, ఓ జాగిలం మాత్రం ఖచ్చితంగా పసిగట్టి, అతన్ని వెంటాడి హతమార్చింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. 
 
ఆ ఉగ్ర‌వాదిని వేటాడిన జాగిలం ఫోటోను డోనాల్డ్ ట్రంప్ రిలీజ్ చేశారు. ఓ చూడ‌ముచ్చ‌టైన జాగిలం ఫోటోను రిలీజ్ చేశామ‌ని, అబూ బాక‌ర్‌ను ప‌ట్టుకుని చంప‌డంలో ఈ జాగిలం కీల‌క పాత్ర పోషించిన‌ట్లు ట్రంప్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఆ జాగిలం పేరును మాత్రం వెల్ల‌డించ‌లేదు. 
 
శ‌నివారం జ‌రిగిన ఆప‌రేష‌న్‌లో ఆ జాగిలం స్వ‌ల్పంగా గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. సిరియాలోని ఓ ట‌న్నెల్‌లో దాక్కున్న‌ బ‌గ్దాదీని అమెరికా భద్రతా బలగాలు వెంటాడి చంపేశాయి. బ‌గ్దాదీని చంపిన విష‌యాన్ని మీడియాతో చెబుతున్న స‌మ‌యంలో.. ట్రంప్ ఈ జాగిలాన్ని విశేషంగా కొనియాడారు. 
 
ట‌న్నెల్‌లో బ‌గ్దాదీని ఆ శున‌కం వెంటాడిన‌ట్లు ప్రెస్‌కాన్ఫ‌రెన్స్‌లో ట్రంప్ తెలిపారు. ఆ త‌ర్వాత ఓ ట్వీట్‌లో ఆ జాగిలం ఫోటోను పోస్టు చేశారు. అయితే, ఈ దాడిలో జాగిలం కూడా స్వల్పంగా గాయపడినట్టు అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. 

 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments