Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో ఖననానికి స్థలం లేదు.. నా భూమిని వాడుకోండంటూ ఢిల్లీ వాసి వినతి

కేరళ రాష్ట్రంలో సంభవించిన వరద బీభత్సానికి అనేకమంది మృత్యువాతపడ్డారు. పైగా, కుంభవృష్టికారణంగా ఎటు చూసినా కనుచూపు మేరలో నీరు వరద నీరు కనిపిస్తోంది. దీంతో చనిపోయినవారిని ఖననం చేసే శ్మశానవాటికల్లో కూడా నడ

Webdunia
సోమవారం, 20 ఆగస్టు 2018 (16:09 IST)
కేరళ రాష్ట్రంలో సంభవించిన వరద బీభత్సానికి అనేకమంది మృత్యువాతపడ్డారు. పైగా, కుంభవృష్టికారణంగా ఎటు చూసినా కనుచూపు మేరలో నీరు వరద నీరు కనిపిస్తోంది. దీంతో చనిపోయినవారిని ఖననం చేసే శ్మశానవాటికల్లో కూడా నడుంలోతు నీళ్లు నిల్వ ఉన్నాయి. దీంతో మృతదేహాల ఖననం ఓ ప్రసహనంగా మారింది.
 
ఈ నేపథ్యంలో నా భూమిని శ్మశాన వాటికగా వాడుకోండి అంటూ ఓ మానవతావాది ముందుకొచ్చాడు. తన జన్మభూమిలో వరద బీభత్సానికి మృతి చెందిన వారిని తన భూమిలో ఖననం చేయండని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ఆయన పేరు కె.శామ్యూల్. వయసు 49 యేళ్ళు. జన్మస్థలం కేరళ అయినప్పటికీ.. స్థిరపడింది మాత్రం ఢిల్లీలో. 
 
ఈయన కేరళ రాష్ట్రంలోని ఆడూర్ మున్సిపాలిటీలోని ఆనంద్‌పల్లి గ్రామ నివాశి. కురువిల్ల కే. శామ్యూల్(49) తన చిన్న వయసులోనే ఢిల్లీకి వెళ్లి స్థిరపడ్డాడు. అయితే శామ్యూల్‌కు ఆనందపల్లిలో ఒక ఇల్లు, 25 సెంట్ల భూమి ఉంది. ప్రస్తుతం ఈ ఇంట్లో ఎవరూ ఉండటం లేదు. కేరళలో వర్షాలు, వరద బీభత్సానికి 350 మందికి పైగా మృతి చెందిన విషయం విదితమే. 
 
వీరందరిని తన భూమిలో ఖననం చేయండని శామ్యూల్ ట్వీట్ చేశారు. మృతుల బంధువులకు భరోసా ఇచ్చి.. వారికి కాస్త ఉపశమనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు శామ్యూల్ తెలిపాడు. ఇలాంటి తరుణంలో పెద్ద మనసుతో ముందుకు వచ్చిన ఆయన్ను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments