సీఎం కుర్చీలో నేరస్థులా? అందుకే నాడు మోడీని తప్పించాలని కోరా...

గోద్రా అల్లర్ల తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని తప్పించాలని డిమాండ్ చేసిన మాట వాస్తవమేనని, ఇందులో తప్పేముందని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు.

Webdunia
బుధవారం, 4 ఏప్రియల్ 2018 (11:43 IST)
గోద్రా అల్లర్ల తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని తప్పించాలని డిమాండ్ చేసిన మాట వాస్తవమేనని, ఇందులో తప్పేముందని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన జాతీయ మీడియాతో మాట్లాడే సమయంలో గుజరాత్ అల్లర్ల తర్వాత మోడీని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని అందరికన్నా ముందు మీరే కదా డిమాండ్ చేశారు అనే ప్రశ్న ఎదురైంది. 
 
దీనికి సీఎం సమాధానమిస్తూ, అవునని చెప్పారు. జరిగిన విషయాలను చరిత్ర రికార్డుల నుంచి ఎవరూ చెరిపివేయలేరని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే మోడీతో చేతులు కలిపానని... కానీ, ఆయన ఇలా చేస్తారని తాను అనుకోలేదని చెప్పారు. అప్పట్లో మీరు అన్న మాటలను మోడీ గుర్తుంచుకున్నారేమో అనే ప్రశ్నకు బదులుగా... గుర్తుంచుకొని ఉండవచ్చేమో అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. నేరారోపణలు ఎదుర్కొనేవారు అత్యున్నత స్థానాల్లో ఉండరాదనే తాను ఆ తరహా డిమాండ్ చేసినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: పసుపు గౌనులో గోల్డెన్ బ్యూటీ అవార్డు గెలుచుకున్న తమన్నా భాటియా

Pooja Hegde :వర్షం, పర్వత ప్రాంత ప్రార్థనాల మధ్య దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే చిత్రం షూట్

Laya: జగపతి బాబు, లయల మధ్య ఫ్యామిలీ కెమిస్ట్రీ తో వదలా నుంచి మెలోడీ సాంగ్

Sunil : పుష్ప తర్వాత నా లైఫ్ సర్‌ప్రైజింగ్ మోడ్‌లో పడింది. : సునీల్

Manoj Manchu: సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్ ను స్వీకరించిన మనోజ్ మంచు

తర్వాతి కథనం
Show comments