Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య తుది తీర్పు : సర్వత్రా ఉత్కంఠ... చీఫ్ జస్టిస్ విదేశీ పర్యటనను రద్దు

Webdunia
గురువారం, 17 అక్టోబరు 2019 (19:12 IST)
ఎన్నో దశాబ్దాలుగా సాగుతూ వచ్చిన అయోధ్య భూవివాద కేసుకు త్వరలో పరిష్కారం లభించనుంది. దీంతో దేశ వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయోధ్య భూవివాదం కేసులో రోజు విచారణ ముగిసింది. త్వరలో తుదితీర్పును వెలువరించనుంది. ఇందుకోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ తన విదేశీ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. 
 
సుధీర్ఘకాలంగా విచారణ కొనసాగిన అయోధ్య భూవివాదం కేసులో వాద ప్రతివాదనలు పూర్తయ్యాయి. సుప్రీంకోర్టు తుది తీర్పు రిజర్వులో పెట్టింది. దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ వివాదంలో తీర్పును ప్రకటించాలన్న ఉద్దేశంతో గొగోయ్ తన విదేశీ పర్యటన విరమించుకున్నారని సమాచారం.
 
ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన 14 పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది.  జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మొత్తం నలబై రోజులుపాటు వాద ప్రతివాదనలు విన్నది.  మరో పక్క గొగోయ్ పదవీకాలం వచ్చే నెల 17న పూర్తికానుండటంతో ఈ లోపే చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2: ది రూల్‌లో రష్మిక మందన్న చనిపోతుందా? పుష్పది హీరోయిజమా?

రాజు వెడ్స్ రాంబాయి క్లైమాక్స్ చూశాక నిద్రపట్టలేదు : వేణు ఊడుగుల

అల్లు అర్జున్ గురించి నిజాలు బయటపెట్టిన మాత్రుమూర్తి నిర్మల

ఎన్ని జరిగినా భార్య వెన్నుముకలా వుంది: జానీ మాస్టర్

కె.సీఆర్ స్పూర్తితో కేశవ చంద్ర రమావత్ సినిమా : హరీష్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments