Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల: ఎప్పుడెప్పుడంటే?

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (17:42 IST)
నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలును విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ గురించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా మాట్లాడుతూ... ఏప్రిల్ 6న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో జరుగుతాయన్నారు. మే 2న ఓట్ల లెక్కింపు జరుపుతారు.
 
కేరళలో ఏప్రిల్ 6న ఎన్నికలు నిర్వహిస్తారు. మే 2 న ఓట్ల లెక్కింపు. అస్సాం అసెంబ్లీ ఎన్నికలు 3 దశల్లో జరుగుతాయి. 1వ దశ పోలింగ్- మార్చి 27, రెండవ దశ పోలింగ్- ఏప్రిల్ 1, మూడవ దశ పోలింగ్- ఏప్రిల్ 6; మే 2న లెక్కింపు వుంటుంది.
 
పశ్చిమ బెంగాల్ మార్చి 27న మొదటి దశ పోలింగ్, ఏప్రిల్ 1న రెండవ దశ పోలింగ్, ఏప్రిల్ 6న మూడవ దశ పోలింగ్, ఏప్రిల్ 10న నాల్గవ దశ పోలింగ్, ఏప్రిల్ 17న ఐదవ దశ పోలింగ్, ఏప్రిల్ 22న ఆరవ దశ పోలింగ్, ఏడవ దశ- ఏప్రిల్ 26, చివరి దశ పోలింగ్- ఏప్రిల్ 29. ఓట్ల లెక్కింపు మే 2.
 
కాగా కేరళలో 140 అసెంబ్లీ స్థానలతో పాటు అస్సోం 126, తమిళనాడు 234, పశ్చిమబెంగాల్‌ 294, పుదుచ్చేరి 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు 16 రాష్ట్రాల్లో 34 స్థానాలకు ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్‌ విడుదల చేసింది ఎన్నికల సంఘం.

సంబంధిత వార్తలు

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో చరణ్ తేజ్ బాలీవుడ్‌లో ఎంట్రీ

టైసన్ నాయుడు కీలక షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..

కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..

తర్వాతి కథనం
Show comments