Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రోగులను ఉత్సాహపరిచేందుకు.. డ్యాన్స్ చేసిన డాక్టర్.. ఎక్కడ? (Video)

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (15:29 IST)
కరోనా వైరస్ సోకిందంటే చాలు ఇక ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందేనని భయం చాలా మందిని ఆహవించింది. దీంతో అనేక మంది ఈ వైరస్ సోకడం కంటే.. వైరస్ సోకిందన్న భయంతో ప్రాణాలు విడుస్తున్నారు. అయితే, తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్యులు, వైద్య సిబ్బంది, ఆస్పత్రి పారామెడల్ స్టాఫ్, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు గత ఏడు నెలలుగా విధులు నిర్వహిస్తున్నారు. 
 
ఈ క్రమంలో అస్సాం రాష్ట్రంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. కరోనా రోగులకు వైద్యం చేసే వైద్యుడు ఒకరు.. కరోనా రోగులను ఉత్సాహపరిచేందుకు వారి ముందు డ్యాన్స్ చేశారు. కరోనా పేషెంట్లను ఉత్సాహపరిచేందుకు పీపీఈ కిట్‌ లోనే ఆయన డ్యాన్స్ చేశారు. ఆ డాక్టర్ పేరు అరూప్ సేనాపతి. ఈ వైద్యుడి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ వైద్యుడు "వార్" సినిమాలోని ఘంగ్రూ పాటకు ఆయన స్టెప్పులు వేయడాన్ని అతని సహోద్యోగి డాక్టర్‌ ఫైజన్‌ అహ్మద్ వీడియో తీసి‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ఈ వీడియో వైరల్ అవుతోంది. అసోంలోని సిల్చార్‌ మెడికల్‌ కాలేజీలో ఆయన డ్యాన్స్ చేశారని ఫూజన్ వివరించారు. ఈ వీడియోను రెండు లక్షల మందికి పైగా చూశారు. ఇటువంటి వైద్యులు ఉంటే పేషెంట్లకు బాధలు ఉండవంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఆయనను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments